• October 19, 2021

TWITTER TALK : అనసూయపై ట్రోలింగ్.. కోట శ్రీనివాసరావుపై అలా

TWITTER TALK : అనసూయపై ట్రోలింగ్.. కోట శ్రీనివాసరావుపై అలా

    కోట శ్రీనివాసరావు ఈ మధ్య కొన్ని మాటలు అనేశారు. ప్రకాష్ రాజ్, మా ఎన్నికలు, అనసూయ ఇలా చాలా విషయాల మీద కోట స్పందించాడు. తెలుగోడే ఉండాలంటూ మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకు మద్దతు తెలిపాడు. ఈ విషయం మీద నాగబాబు దారుణమైన మాటలు అనేశాడు. వాడు వీడు రేపోమాపో పోతాడు అంటూ కోట గురించి నాగబాబు అన్న మాటలు మెగా ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగించాయి. ఆ విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక అనసూయ మీద కోట చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

    ఆ మధ్య ఒకసారి అనసూయ ఎవరో తనకు తెలీదని కోట అన్నాడు. ఈ మధ్య మళ్లీ మాట్లాడుతూ.. అనసూయ మంచి న‌టి. చక్కటి పర్సనాలిటీ, చ‌క్క‌గా హావ‌భావాలు ప‌లికిస్తార‌ని. చ‌క్క‌గా డాన్సులు చేస్తారు. కానీ ఆమె అలాంటి బట్టలు వేసుకుని జబర్దస్త్ షోలో కనిపించడం నాకు వ్యక్తిగతంగా నచ్చదు అని అన్నాడు. దీనిపై ఇప్పుడు అనసూయ మండిపడింది.

    తన గురించి ఓ సీనియర్ నటులు మాట్లాడాడు అని, తన వస్త్రాధారణ నచ్చదని చెప్పాడట. అయితే ఎలాంటి బట్టలు ధరించాలనేది వ్యక్తిగతమని అనసూయ బధులిచ్చింది. ఒకప్పుడు ఆ సీనియర్ నటులు మందు తాగుతూ పిచ్చి బట్టలు ధరించి ఆడవాళ్లను కించపరిచారు.. అప్పుడు సోషల్ మీడియా ఉండుంటే.. ఇలానే ప్రశ్నించేదా? పైగా పెళ్లి చేసుకుని పిల్లలున్న హీరోలు మాత్రం హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారు.. మీరు ప్రశ్నించారు. వారు షర్ట్ ఇప్పుకుని బాడీని చూపిస్తారు. అది కూడా మీరు తప్పు అనరు. కానీ నా లాంటి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలున్న తల్లిని మాత్రం ప్రశ్నిస్తారు. నా రంగంలో నేను ఏదో సాధించేందుకు ప్రయత్నిస్తుంటే మాత్రం ఇలాంటి కామెంట్లు చేస్తారంటూ కోటను పరోక్షంగా ఏకిపారేసింది అనసూయ.

    అయితే ఈ విషయం మీద అనసూయపై కాస్త నెగెటివ్, పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. కానీ ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి. కోట గారు నీ వస్త్రాధారణ మాత్రమే నచ్చదన్నారు.. కానీ నీ గురించి ఎంతో బాగా చెప్పారు. అది కూడా మెన్షన్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇక కోట గారు చేసిన కామెంట్లు కూడా తప్పే, అలా వస్త్రాధారణ గురించి మాట్లాడకుండా ఉండే బాగుండేదని అంటున్నారు. ఇంకొందరు అయితే మెగా కాంపౌండ్ నుంచి అనసూయకు డబ్బులు వచ్చినట్టున్నాయని, ఆఫర్లు వచ్చినట్టున్నాయని అందుకే ఇలా కోట మీద దాడి చేస్తోందని ఆరోపిస్తున్నారు.

    Leave a Reply