• January 3, 2022

దుబాయ్‌లో దుమ్ములేపిన అమలాపాల్.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ!

దుబాయ్‌లో దుమ్ములేపిన అమలాపాల్.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ!

    దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తమిళ దర్శకుడుని వివాహం చేసుకున్న అనంతరం కొన్ని నెలలకే అతనితో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకుల తర్వాత అమలాపాల్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టి బోల్డ్ పాత్రలో నటించడానికి కూడా సై అంటోంది.

    ఈ విధంగా అమలాపాల్ ప్రస్తుతం తమిళంలోనూ, తెలుగులో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా అమలాపాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే అమలాపాల్ కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    అమలాపాల్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె చేతిలో మందు గ్లాస్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజనులు ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా చేతిలో మందు గ్లాస్ తో ఫోటోలను షేర్ చేస్తూ సమాజానికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారంటూ కొందరు అభిమానులు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Leave a Reply