• November 6, 2021

AAA : మహేష్, విజయ్ బాటలో బన్నీ.. వారి భాగస్వామ్యంలో భారీ నిర్మాణం

AAA : మహేష్, విజయ్ బాటలో బన్నీ.. వారి భాగస్వామ్యంలో భారీ నిర్మాణం

    ఏసియన్ అధినేత నారాయణ్ దాస్ కే నారంగ్ ఆయన కుమారుడు సునీల్ నారంగ్ డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి ఎదిగారు. ఇప్పుడు హై క్లాస్ మల్టీప్లెక్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. భారీ చిత్రాలతో పాటుగా భారీ మల్టీప్లెక్సులను నిర్మిస్తున్నారు. ఈక్రమంలోనే హైద్రాబాద్ గచ్చిబౌలీలో ఏఎంబీ అంటూ మహేష్ బాబుతో కలిసి మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఇక మహబూబ్ నగర్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీ అంటూ అద్భుతమైన మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.

    ఇక ఇప్పుడు నగరం నడి బొడ్డున అల్లు అర్జున్‌తో కలిసి భారీ మల్టీ ప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు, విజయ్ దేవరకొండల తరువాత ఇప్పుడు బన్నీ మల్టీ ప్లెక్స్ ఓనర్ కాబోతోన్నాడు. ఏసియన్ అల్లు అర్జున్, అల్లు అర్జున్ ఏసియన్ (AAA) అంటూ ఈ మల్టీప్లెక్స్ తయారుకాబోతోంది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లతో ఈ భవనం అమీర్ పేట్‌లో అత్యాధునిక హంగులతో రాబోతోందట. ఇందులో చాలా మంది భాగస్వామ్యులుగా ఉన్నారని తెలుస్తోంది.

    సత్యం థియేటర్‌కు ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ రాబోతోంది. మాల్‌కు సంబంధించిన నిర్మాణం పూర్తయింది. ఇక నేడు మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిటీకి లాండ్ మార్క్‌లా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోందని సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్‌ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ తయారవుతోంది.

    Leave a Reply