- December 17, 2021
Pushpa Twitter Review : పుష్ప ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన బన్నీ

Pushpa The Rise Twitter Review అల్లు అర్జున్ పుష్ప మేనియా ఇప్పుడు సోషల్ మీడియాను రాజ్యమేలుతోంది. నిన్నటి నుంచి పుష్పకు సంబంధించిన వార్తలతో నెట్టిళ్లు మొత్తం సందడిగా మారింది. డిసెంబర్ 17న పుష్ప అంటే సందడి మాత్రం వారం క్రితమే మొదలైంది. అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుండటం, అన్ని భాషల మీడియాతో బన్నీ ఇంటరాక్ట్ అవుతూ ఉండటంతో పుష్పకు సంబంధించిన వార్తలతో సోషల్ మీడియా నిండిపోయింది.
అయితే ఇప్పుడు పుష్ప సినిమా షోలు ప్రపంచ వ్యాప్తంగా పడిపోయాయి. దీంతో పుష్ప టాక్ కూడా బయటకు వచ్చింది. ట్విట్టర్లో పుష్ప హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. Pushpa Movie Twitter Review పుష్ప మీద డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకో ఏమో తెలీదు కానీ సినిమాను బిలో యావరేజ్ అంటూ కొంత మంది ట్వీట్లు పెడుతున్నారు. ఇంకొంత మంది అయితే నెవ్వర్ బిఫోర్ అంటూ అల్లు అర్జున్, సుకుమార్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
Done with #Pushpa
Excellent Performance By @alluarjun Attitude Mannerism peaks 👏👌 Never Before role for Him
Fight scenes and Elevations🔥🔥🔥 BGM padukopetteysaadu #DSP🤦♂️🤦♂️🤦♂️
Correct BGm padi untey verey level undedhi
Overall Excellent Movie #PushpaTheRise #ThaggedheLe— self_admiRRRing (@Bikshucherry1) December 16, 2021
ఇప్పుడే పుష్ప సినిమాను చూశాను.. అల్లు అర్జున్ నటన, మ్యానరిజం పీక్స్.. ఇలాంటి పాత్ర నెవ్వర్ బిఫోర్.. ఫైట్ సీక్వెన్స్, ఎలివేషన్స్ మాత్రం హైలెట్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పడుకోబెట్టేశాడు.. కరెక్ట్ బీజీఎం ఉంటే వేరే లెవెల్ ఉండేది. ఓవరాల్ ఎక్సలెంట్ మూవీ అని ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు.
Villain Fahad fazil was the perfect cast for the mass hero. High voltage drama and audience were whistling non stop inside theatre #Pushpa
— Satsu (@vetridad) December 16, 2021
సినిమా అదిరిపోయింది. అన్ని రకాల మాస్ మసాలా కమర్షియల్ హంగులున్నాయని ఇంకొందరు అంటున్నారు. ఇక విలన్ ఫాహద్ ఫాజిల్ అల్లు అర్జున్ మధ్య సీన్లు మాత్రం మామూలుగా ఉండవట. ఈ ఇద్దరూ కలిసినప్పుడు చొక్కాలు చించుకోవడమేనట. అయితే కొంతమంది ఇది ఇండస్ట్రీ హిట్ అని అంటే.. ఇంకొంత మంది మాత్రం యావరేజ్ సినిమా అని అంటున్నారు.
#Pushpa 3/5 Good watchable movie.
++ Bunny & Sukumar
– – Rashmika & movie length 3 hours
songs order wise in movie
1st half
Daakko Daako
Choope bangaramaaye
Oo Amtava
2nd half
Saami
Eyy Bidda Idhi Naa Adda
— NTR (@Tarak_NTR_9999) December 16, 2021
ఇక రష్మిక మందాన్నను మాత్రం కొందరు నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అతి చేసిందని, మామూలుగానే రష్మికను చూడలేమని, కానీ ఇలా డీ గ్లామర్ అని చెప్పి జనాల మీద రుద్దితే ఎలా అని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాకు ప్లస్ మాత్రం బన్నీ, సుకుమార్ అయితే.. నెగెటివ్ మాత్రం రష్మిక మందాన్న, నిడివి అని అంటున్నారు.
1st half ok
2nd half not goodAvg movie..poor bgm..dull climax..slow narration..long run time..rashmika deglamour role..#AlluArjun performance only positive
One time watch!
— Kannada Abhimani (@karunadaPutra) December 16, 2021
సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అని, సెకండాఫ్ బాగా లేదని కొందరు అంటున్నారు. యావరేజ్ మూవీ, పూర్ బీజీఎం, డల్ క్లైమాక్స్, స్లో నెరేషన్, లాంగ్ డ్యూరేషన్, రష్మిక డీ గ్లామర్ రోల్ నెగెటివ్స్ అని అంటున్నారు. బన్నీ పర్ఫామెన్స్ మాత్రమే పాజిటివ్ అని అంటున్నారు. మొత్తానికి బన్నీ మాత్రం దుమ్ములేపేశాడని యునానిమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా సమంత జాడ మాత్రం కనిపించడం లేదు. ఐటం సాంగ్ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు.
Over all ok
First half is very good
Second half below average
Climax asalu nachala
Part -2 chudali ela untundho
AA excelled as puspha Raj
Comedy Chala bagundhi
climax should have been must better way to end And to start part-2#Pushpa https://t.co/VUVGJ2KN6z— Prabhas Era👑👑👑ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Dhfp_forever) December 17, 2021
ఫస్ట్ హాఫ్ బాగుంది.. ఎక్కడా బోర్ కొట్టలే.. అల్లు అర్జున్ యాటిట్యూడ్, మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, కామెడీ చాలా బాగుంది.. సమంత ఐటం సాంగ్ హాటుగా ఉందని ఒకరు.. ఓవరాల్‌గా ఓకే.. ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్.. సెకండాఫ్ బిలో యావరేజ్.. క్లైమాక్స్ అస్సలు నచ్చలే.. పార్ట్ 2 చూడాలి ఎలా ఉంటుందో.. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ అదరగొట్టేశాడు.. కామెడీ చాలా బాగుంది.. పుష్ప సెకండ్ పార్ట్ కోసం క్లైమాక్స్‌ను బాగా తీసి ఉండాల్సింది అని అంటున్నారు.