• December 17, 2021

Pushpa The Rise : పుష్పకు దెబ్బ మీద దెబ్బ.. చేతులెత్తేసిన చిత్రయూనిట్

Pushpa The Rise : పుష్పకు దెబ్బ మీద దెబ్బ.. చేతులెత్తేసిన చిత్రయూనిట్

    Pushpa Movie పుష్ప సినిమాను ఎంత హడావిడిగా రిలీజ్ చేశారో అందరికీ తెలిసిందే. సినిమా ఎక్కడా ఎలా ఆలస్యమైందో చిత్రయూనిట్‌కే తెలియాలి. చివరి నిమిషంలో ప్రమోషన్స్ కూడా కుదురుగా చేయలేదు. చెన్నై, బెంగళూరు, కొచ్చి, ముంబై, హైద్రాబాద్ అంటూ అటూ ఇటూ బన్నీ, రష్మిక తిరిగారు. సుకుమార్ మాత్రం సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అలా చివరి నిమిషం వరకు సినిమా కోసమే సుకుమార్ కష్టపడ్డాడు.

    అయితే సుకుమార్ ఎంత కష్టపడ్డా కూడా కొన్ని చోట్ల మాత్రం దెబ్బ పడింది. ఎందుకు అన్ని భాషల్లో ఒకే సారి విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదో డెడ్ లైన్ పెట్టుకున్నాం కదా? అని విడుదల చేయాలి కదా? అని విడుదల చేసినట్టున్నారు. అలా మొత్తానికి కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. మళయాలంలో తెలుగు సినిమానే ప్రదర్శించారట.

    మళయాలం వర్షన్‌ను కేరళలో రిలీజ్ చేసేందుకు శాయశక్తులా కష్టపడ్డారట. కానీ చివరి క్షణం వరకు ఇవ్వలేదట. దీంతో కేరళలో మళాయలి వర్షన్ కాకుండా తెలుగు వర్షన్‌ రిలీజ్ చేశారట. రేపటి నుంచి మళయాలంలో సినిమాను ప్రదర్శిస్తారట. మొత్తానికి ఇలా హడావిడిగా సినిమాను అలా సర్దేసి జనాల మీదకు వదిలేస్తున్నారు.

    ఇక కొన్ని చోట్ల షోలు రద్దయ్యాయి. బెనిఫిట్ షోలు లేకుండాపోయాయి. ఇలా పుష్పకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మరి మొత్తానికి ఈ మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటి ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్‌లో 441k డాలర్లు వచ్చాయని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప మొదటి రోజే దాదాపు 50 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.

    Leave a Reply