• October 20, 2021

ఎవరితో పడితే వాళ్లతో.. పూజా హెగ్డేపై అల్లు అర్జున్ సంచలన కామెంట్స్

ఎవరితో పడితే వాళ్లతో.. పూజా హెగ్డేపై అల్లు అర్జున్ సంచలన కామెంట్స్

    ప్రస్తుతం పూజా హెగ్డే మంచి ఫాంలో ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌లో పూజాహెగ్డేకు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూజా హెగ్డే నటించే ప్రతీ సినిమా ఓ రేంజ్‌లో హిట్ అవుతోంది. అలా గోల్డెన్ లెగ్‌గా పూజా హెగ్డే దూసుకుపోతోంది. చివరకు అయ్యగారైన అఖిల్‌‌కు కూడా హిట్ ఇచ్చేసింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ పూజా హెగ్డే, అఖిల్‌లకు మంచి హిట్ వచ్చింది. ఎంతో కాలం నుంచి సక్సెస్ కోసం ఎదురు చూసిన అఖిల్‌కు మొదటి విజయం లభించింది.

    మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా హిట్ అవ్వడంతో నిన్న సక్సెస్ మీట్ పెట్టింది చిత్రయూనిట్. ఇందులో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చి సినిమా గురించి మాట్లాడాడు. ఈక్రమంలో పూజా హెగ్డే మీద సంచలన కామెంట్స్ చేశాడు. పూజా హెగ్డేను ముకుంద సినిమా నుంచి చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజా హెగ్డే అలా ఎదుగుతూనే వస్తోంది. అందంలో సినిమా సినిమాకు పెరుగుతోంది. ఇక నటనలోనూ ఒక్కో మెట్టు ఎక్కుతోందని అన్నాడు.

    బ్యాచ్ లర్ సినిమాతో ఇంకో రెండు మెట్లు ఎక్కేసిందని అన్నాడు. నువ్ నా ఒక్కదానికే లక్కీ ఛార్మ్ అని అనుకున్నాను. కానీ అందరికీ నువ్ స్పెషల్.. ఎవరితో సినిమా తీసినా వాళ్లకు బ్లాక్ బస్టర్ ఇస్తున్నావ్..ఎవరితో పడితో వాళ్లతో సినిమాలు తీసి హిట్లు ఇస్తున్నావ్ అని అనేశాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించావ్.. నా సినిమాకు కూడా ఇది చెప్పలేదు.. కానీ బ్యాచ్‌లర్ సినిమాలో అద్భుతంగా నటించావ్ అంటూ పూజా హెగ్డే మీద ప్రశంసల వర్షం కురిపించాడు.

    Leave a Reply