• October 5, 2022

The Ghost Movie Review : నాగార్జున ది ఘోస్ట్ మూవీ రివ్యూ

The Ghost Movie Review : నాగార్జున ది ఘోస్ట్ మూవీ రివ్యూ

    Ghost Movie Review బంగార్రాజు సినిమాతో కింగ్ నాగార్జున ఓ మాదిరిగా హిట్ కొట్టేశాడు. అంతకు ముందు చేసిన ప్రయోగాలు వర్కవుట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఘోస్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు వంటి డైరెక్టర్‌తో నాగార్జున చేసిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

    దుబాయ్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ (నాగార్జున) ఓ ఆపరేషన్ చేస్తాడు. అందులో కిడ్నాపర్లను హతమార్చినా కూడా పిల్లాడిని కాపాడలేకపోతాడు. దీంతో కిడ్నాపర్లు, అండర్ వరల్డ్‌ను మట్టుబెట్టాలని అనుకుంటాడు. ఈ విషయంలో అతని ప్రేయసి, కొలిగ్ ప్రియ (సోనాలి చౌహాన్) వద్దని వారిస్తుంది. కానీ విక్రమ్ మాత్రం ముందుకు వెళ్తాడు. సరిగ్గా ఐదేళ్ల తరువాత విక్రమ్ మళ్లీ కనిపిస్తాడు. ఆ సమయంలోనే 20 ఏళ్లుగా తనకు దూరంగా, మాట్లాడకుండా ఉన్న తన అక్క అనుపమ (గుల్ పనాగ్) కాల్ చేస్తుంది. తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్)కి వచ్చిన ఆపద గురించి చెబుతుంది. దీంతో అదితిని కాపాడేందుకు విక్రమ్ వస్తాడు. విక్రమ్ ఘోస్ట్‌గా చేసిన పనులు ఏంటి? అదితి కోసం వెంటపడిన గ్యాంగ్ కథ ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడగలిగాడా? అన్నది కథ.

    ది ఘోస్ట్ సినిమాలో ఉన్న వైరుధ్యం, వైవిధ్యత, ట్రైలర్ టీజర్‌లో చూపించిన ఫ్రెష్ నెస్ మాత్రం సినిమాలో కనిపించదు.డ్రగ్స్, కిడ్నాప్స్ అంటూ ఏదేదో చూపించారు. సినిమా కూడా పూర్తిగా దాని నేపథ్యంలో ఉందని అనుకుని సినిమాకు వస్తే నిరాశే కలుగుతుంది. సినిమా ఆ ట్రాకులోంచి వచ్చేస్తుంది. ఫ్యామిలీ ట్రాక్ ఎక్కేస్తుంది. నాయర్, సినార్ కంపెనీల మధ్య ఉన్న పోటీ, ద్వేషాల చుట్టే ఈ కథ తిరుగుతుంది. అలా ఇది ఓ సాదా సీదా రివేంజ్ స్టోరీలా మారుతుంది.

    ఇలాంటి కథను ప్రేక్షకుడికి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు ప్రవీణ్ సత్తారు. కానీ కథనంలో మాత్రం కొత్తదనం కనిపించదు. వెరసి ది ఘోస్ట్ వరస్ట్ అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు అయితే కామెడీగా అనిపిస్తాయి. కత్తి పట్టుకుని నరుక్కుంటూ పోయే విక్రమ్‌కు.. గన్నులతో డీల్స్ చేసే అండర్ వరల్డ్ డాన్స్ సాకిల పడతారు. వదిలేయమని బతిమిలాడతారు. అది మరీ నవ్వును తెప్పించేలా ఉంటుంది. సెకండాఫ్ సినిమా పట్టాలు తప్పినట్టుగా అనిపిస్తుంది. ఘోస్ట్ టైటిల్‌కు న్యాయం చేసినట్టుగా అనిపించదు.

    సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. మాటలు అంతగా ప్రభావాన్ని చూపించలేదనిపిస్తుంది. కెమెరాపనితనం బాగుంది. ఊటి అందాలను చక్కగా చూపించారు. గోవా, దుబాయ్ అంటూ కథను అటూ ఇటూ తిప్పేశారు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

    విక్రమ్‌గా నాగార్జున, అదితిగా అనికా, అనుపమగా గుల్ పనాగ్, ప్రియ పాత్రలో సోనాల్ చౌహాన్ మెప్పించారు. శ్రీకాంత్ అయ్యర్, రవివర్మ, విలన్లుగా కనిపించిన వారు తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించేశారు.

    చివరగా.. ది ఘోస్ట్.. వరస్ట్

    రేటింగ్ 2