• September 1, 2022

Bigg Boss 6 Telugu పెద్ద వాళ్ల సపోర్ట్ లేదట!.. బిగ్ బాస్ షొలోకి వెళ్లడంపై ఆది రెడ్డి హింట్

Bigg Boss 6 Telugu పెద్ద వాళ్ల సపోర్ట్ లేదట!.. బిగ్ బాస్ షొలోకి  వెళ్లడంపై ఆది రెడ్డి హింట్

    Bigg Boss Telugu 6-Adireddy బిగ్ బాస్ షోల మీద రివ్యూలు ఇస్తూ ఎంతో మంది ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ షో అంటే అందరికీ వినోదం. అందరికీ అర్థమయ్యేలా ఆ షోను వివరించడం, ఎలా జరిగిందో చెప్పడం, ఏ కంటెస్టెంట్ ఎలా ఉన్నాడు.. ఎక్కడ తప్పు చేశాడు అనే దాని మీద విశ్లేషిస్తుంటాడు. దీనిపై సహజంగానే ఎదురు దాడి జరుగుతుంది. ఎందుకంటే ఒకరిని పొగిడితే.. మిగతా కంటెస్టెంట్ల అభిమానులకు నచ్చదు. అలా రివ్యూయర్ల మీద ఎప్పుడూ కాస్త నెగెటివిటీ ఉండనే ఉంటుంది. దీనిపై తాజాగా బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి చెప్పుకొచ్చాడు.

     

    బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆది రెడ్డి ఓ కంటెస్టెంట్‌గా రాబోతోన్న సంగతి తెలసిందే. ఎప్పటి నుంచో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. లీకైన కంటెస్టెంట్లతో ఆది రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ షో సెప్టెంబర్ 4వ తేదీని ప్రారంభం కాబోతోంది. ఇది వరకే కంటెస్టెంట్లు ఆల్రెడీ క్వారంటైన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆది రెడ్డి ఇప్పుడు తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాటిని గమనిస్తుంటే ఆ వార్తలే నిజమని అర్థమవుతోంది. తాజాగా ఆయన పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

    బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తోన్నట్టుగా స్పష్టంగా చెప్పలేదు. కానీ అందరి సపోర్ట్ కావాలని, రివ్యూయర్లకు సహజంగానే నెగెటివిటీ ఉంటుందని, కానీ తాను ఎప్పటికీ బిగ్ బాస్ రివ్యూయర్‌గానే ఉంటానని చెప్పుకొచ్చాడు. తనకు పెద్ద వాళ్ల సపోర్ట్ లేదని, తనకు ఎప్పుడూ ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తోన్నట్టుగా చెప్పుకొచ్చాడు. త్వరలోనే కలుద్దామంటూ ఆది రెడ్డి పోస్టులు పెట్టేశాడు. అంటే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినట్టు ఇక్కడే కన్ఫామ్ చేసేసినట్టు కనిపిస్తోంది. మరి ఆది రెడ్డికి బిగ్ బాస్ షో ద్వారా ఎలాంటి ఇమేజ్ వస్తుంది? ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాడన్నది చూడాలి.