• December 8, 2021

Akhanda : నా పని అయిపోతుంది!.. ‘అఖండ’ రేప్ సీన్‌పై పూర్ణ కామెంట్స్

Akhanda : నా పని అయిపోతుంది!.. ‘అఖండ’ రేప్ సీన్‌పై పూర్ణ కామెంట్స్

    Srikanth-Poorna అఖండ సినిమాలో శ్రీకాంత్ వేసిన పాత్ర ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే పాత్రలో భయానకం బాగానే ఉన్నా అది శ్రీకాంత్ మాత్రం సరిగ్గా పలకించలేకపోయాడని, విలన్ పాత్రకు సెట్ అవ్వలేదని అంతా అనుకుంటున్నారు. అందుకే అఖండ ఇంత పెద్ద సక్సెస్ అయినా కూడా శ్రీకాంత్ పేరు ఎక్కడా ఎక్కువగా వినిపించడం లేదు. లెజెండ్ సమయంలో జగపతి బాబుకు వచ్చినంత పేరు ఇప్పుడు శ్రీకాంత్‌కు రావడం లేదు.

    అయితే తాజాగా శ్రీకాంత్, పూర్ణలు అఖండ సక్సెస్‌లో భాగంగా ఆలీతో సరదాగా షోకు గెస్టులుగా వచ్చారు. ఇందులో ఈ ఇద్దరూ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు శ్రీకాంత్‌లా ఉండాలా? వరదరాజులా ఉండాలా? అని శ్రీకాంత్ అడుగుతాడు ఆలీని. వరదరాజులా ఉండాలని అనుకుంటున్నావా? ఆలీ అంటాడు. అలా ఉంటే నీ పని అయిపోతుంది కదా? అని శ్రీకాంత్ కౌంటర్ వేస్తాడు.

    ఆ వెంటనే పూర్ణ కూడా మధ్యలోకి అవుతుంది. నా పని కూడా అయిపోతుంది.. ఆయన వరదరాజులు అయితే.. నేను పద్మావతిని కదా? అని పూర్ణ భయపడుతుంది. దీంతో ఆలీ తనలోని మన్మథుడిని బయటకు తట్టి లేపుతాడు. ఈ ఒక్కసారి నువ్ ఇక్కడకు రా.. నేను వరద రాజులు అవుతాను అని శ్రీకాంత్‌ను అంటాడు. దీంతో పూర్ణ పగల బడి నవ్వుతుంది.

    మొత్తానికి అఖండ సినిమా హిట్ అయింది. కానీ పేరు మాత్రం బాలయ్య బోయపాటికి మాత్రమే వచ్చింది. మిగిలిన ఎవ్వరూ కూడా అఖండ సక్సెస్‌లో కనిపించడం లేదు. బాలయ్య బోయపాటి కలిస్తే ఇంకెవ్వరూ కనిపించరు అని మరోసారి నిరూపించారు.

    Leave a Reply