• October 22, 2021

సినిమాలు లేవా? అంటూ పరువుదీసిన నెటిజన్.. హరితేజ కౌంటర్ అదుర్స్

సినిమాలు లేవా? అంటూ పరువుదీసిన నెటిజన్.. హరితేజ కౌంటర్ అదుర్స్

    బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ హరితేజ ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన కూతురు భూమి పుట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. తన కూతురికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. హరితేజ మొదట్లో తన కూతురిని చూపించేందుకు ఇష్టపడలేదు. పసికందుగా ఉన్నప్పుడు అలా చూపించేందుకు హరితేజ మనసు ఒప్పుకోలేదేమో. దిష్టి తగులుతుందని అలా చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేశారు.

    అయితే ఇప్పుడు భూమి తల్లి అంటూ హరితేజ తన కూతురికి సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో పెట్టేస్తోంది. అయితే తాజాగా హరితేజ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చింది. ఎక్కువగా పర్సనల్ విషయాలకు సంబంధించిన ప్రశ్నలనే సంధించింది. చిన్నపాప భూమికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వేశారు. పాప ఎలా ఉంది? ఏం తింటోంది? ఏం పెడుతున్నారు? అంటూ ప్రశ్నలను అడిగారు.

    అయితే ఓ నెటిజన్ మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లిపోయాడు. హరితేజ ఇలా ఖాళీగా ఉండి ఆన్సర్లు ఇస్తుందని అలా అనుకున్నాడో ఏమో గానీ.. ఓ ప్రశ్న మాత్రం విసిరాడు. నీకు సినిమాలు లేవా? అంటూ హరితేజను అవమానించాడు. దానికి హరితేజ తక్కువేమీ కాదన్నట్టుగా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఏ నువ్వేమైనా సినిమా అవకాశాలు ఇస్తావా? అని కౌంటర్ వేసింది. మొత్తానికి హరితేజ ఇప్పుడు షూటింగ్‌లకు కాస్త దూరంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. తన పాప కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయిందట.

    Leave a Reply