ట్విట్టర్ రివ్య్యూ : కనిపించని ‘రొమాంటిక్’

ట్విట్టర్ రివ్య్యూ : కనిపించని ‘రొమాంటిక్’

    ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల అయింది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించగా.. ఆల్రెడీ సినిమాను టాలీవుడ్‌లో దర్శకులందరికీ చూపించారు. అయితే నేడు ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ట్విట్టర్‌లో మాత్రం రొమాంటిక్ ఎక్కడా కనిపించడం లేదు.

    అసలు సినిమాను ఎవ్వరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. మొత్తంగా బుకింగ్స్ చూస్తే కూడా దారుణమైన పరిస్థితిలో రొమాంటిక్ ఉంది. ప్రమోషన్స్‌లో సినిమా యూనిట్ చెప్పుకున్నంతగా ఏమీ లేదనిపిస్తోంది. కనీసం ట్విట్టర్‌లో కూడా రొమాంటిక్ చర్చకు దారి తీయడం లేదు. ఎవ్వరూ సినిమా మీద ఆసక్తిని పెట్టలేదనిపిస్తోంది.

    రొమాంటిక్ హ్యాష్ ట్యాగ్ కొడితే సినిమాకు సంబంధించిన విషయాలకంటే వేరేవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అప్పుడు సినిమా సంగతి ఏంటో అర్థమవుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పూరి జగన్నాథ్ డైలాగ్స్ అదిరిపోయాయ్ అని కామెంట్లు పెట్టారు. ఇది ఓటీటీకి కూడా పనికి రాదని ఇంకొకరు కామెంట్ పెట్టేశారు. మొత్తానికి విజయ్ దేవరకొండ, ప్రభాస్ లాంటి వారు ప్రమోషన్స్‌కి వచ్చినా కూడా సినిమా మీద ఎవ్వరికీ ఇంట్రెస్ట్ రాలేదేమో.

    Leave a Reply