• January 28, 2022

Aadavaallu Meeku Johaarlu : ఫిబ్రవరి 25న శర్వా, రష్మిక సందడి

Aadavaallu Meeku Johaarlu : ఫిబ్రవరి 25న శర్వా, రష్మిక సందడి

    Aadavaallu Meeku Johaarlu యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తయింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది.

    అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

    ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. శర్వానంద్, రష్మిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో మొదటసారిగా రష్మిక, శర్వానంద్‌లు కలిసి నటించారు.

    కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

    మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.

    నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

    సాంకేతిక బృందం
    దర్శకత్వం: తిరుమల కిషోర్
    నిర్మాత : సుధాకర్ చెరుకూరి
    బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
    సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
    ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
    ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
    కొరియోగ్రఫర్: దినేష్
    పీఆర్వో: వంశీ-శేఖర్

    Leave a Reply