- August 1, 2025
ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. హనుమాన్, బలగం చిత్రాలకు అవార్డులు

కేంద్రం తాజాగా 71వ జాతీయ ఉత్తమ చిత్రాల అవార్డుల్ని ప్రకటించింది. ఇందులో తెలుగు చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సీలకు అవార్డులు వచ్చాయి. ఇక తెలుగులో ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరికి అవార్డులు వచ్చాయి. ఉత్తమ కామిక్ చిత్రం కేటగిరీలో హనుమాన్కు, బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో సుకుమార్ కుమార్తె సుకృతికి గాంధీ తాత చెట్టు సినిమాకి గానూ అవార్డు వచ్చింది.
బెస్ట్ సింగర్‌గా బేబీ చిత్రంలో ప్రేమిస్తున్నా అనే పాటను పాడిన రోహిత్‌కు అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా బేబీ చిత్రానికి గానూ సాయి రాజేష్‌కు అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా హనుమాన్ మూవీకి గానూ నందు పృథ్వీకి వచ్చింది. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా యానిమల్ చిత్రానికి గానూ హర్షవర్దన్ రామేశ్వర్‌కు అవార్డు వచ్చింది. అలా ఈ సారి ఉత్తమ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బలగం, బేబీ, గాంధీ తాత చెట్టు, హనుమాన్, భగవంత్ కేసరి చిత్రాలు దుమ్ములేపేశాయని చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. హిందీ భాషలో యానిమల్ సినిమాకి గానూ రీ రికార్డింగ్, మిక్సింగ్ కేటగిరీలోనూ అవార్డులు వచ్చాయి.