• December 25, 2021

Shyam Singha Roy Collection : శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే?

Shyam Singha Roy Collection : శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే?

    Shyam Singha Roy 1st Day worldwide Collection శ్యామ్ సింగ రాయ్ ఫస్డ్ డే కలెక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే అవతల అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నాడు. అసలే థియేటర్లన్నీ పుష్ప రాజ్ దెబ్బకు ఫుల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నాని తన శ్యామ్ సింగ రాయ్ సినిమాతో వచ్చాడు. మిక్స్డ్ టాక్‌ వచ్చినా నాని మొదటి రోజు దుమ్ములేపినట్టు కనిపిస్తోంది.

    దాదాపు 500 థియేటర్లలో శ్యామ్ సింగ రాయ్ విడుదలైందని తెలుస్తోంది. నాని, సాయి పల్లవిల మీద ప్రేక్షకులకు ఉన్న నమ్మకం, అంచనాలకు తగ్గట్టుగానే శ్యామ్ సింగ రాయ్‌ను నిర్మించారు. అయితే ఈ చిత్రం మొదటి రోజు మాత్రం అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇంకా అధికార లెక్కలు అయితే రాలేదు గానీ.. ఎక్స్‌పెక్టెడ్ కలెక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

    ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదో కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఇదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. శ్యామ్ సింగ రాయ్ మొదటి రోజు 6.5 నుంచి ఏడు కోట్ల మధ్యలో రాబట్టినట్టు తెలుస్తోంది. అసలే ఇది దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

    ఫస్ట్ డే ఓపెనింగ్‌తో ఇలానే ఓ వారం రోజులు కంటిన్యూగా నడిస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే మధ్యలో కలెక్షన్లు డ్రాప్ అయితే మాత్రం కమర్షియల్‌గా సినిమా సక్సెస్ కావడం మరింత కష్టమవుతుంది.

    Leave a Reply