• December 18, 2021

Pushpa Collection : పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎంతంటే?.. నైజాంలో నయా హిస్టరీ

Pushpa Collection : పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎంతంటే?.. నైజాంలో నయా హిస్టరీ

    Pushpa Day 1 Area wise Collection పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపేసింది. ఇక ఒక్కొ చోట అయితే కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కొన్ని చోట్ల టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం, బెనిఫిట్ షోలు రద్దు కావడంతో ఇంకాస్త తక్కువగా కలెక్ట్ చేసింది. మొత్తానికి పుష్ప మాత్రం అన్ని చోట్లా దుమ్ములేపేసిందనే రిపోర్ట్‌లు వస్తున్నాయి.

    హిందీలో ఈ చిత్రం దాదాపు మూడు కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తోంది. నార్త్‌లో రిలీజ్ అయిన తెలుగు వర్షన్‌కు ఇంకో యాభై లక్షలు వచ్చాయట. అలా మొత్తంగా ఈ సినిమా ఉత్తరాదిన మూడున్నర కోట్లను మొదటి రోజే రాబట్టినట్టు టాక్. ఇక చెన్నై, బెంగళూరు, కొచ్చి వంటి సిటీల్లోనూ పుష్ప సినిమా రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టేసినట్టు తెలుస్తోంది.

    మొదటి రోజు పుష్ప చిత్రం నైజాంలో 11.44 కోట్లు, సీడెడ్‌లో 4.20కోట్లు, ఉత్తరాంద్రలో 1.8కోట్లు, ఈస్ట్ 1.43కోట్లు, వెస్ట్ 1.5కోట్లు, గుంటూరు 2.28కోట్లు, కృష్ణా 1.15కోట్లు, నెల్లురు 1.1కోట్లు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.90 కోట్ల షేర్.. 35.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    మొదటి రోజే 11 కోట్లు కోల్లగొట్టి నైజాం ఏరియాలో పుష్ప సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక తమిళనాడు ఈ చిత్రం 3.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో మొత్తంగా మిలియన్ డాలర్‌కు చేరువలోకి వచ్చింది. అక్కడ ప్రీమియర్స్, మొదటి రోజు కలుపుకుంటే 7 కోట్ల వరకు వసూళ్ చేసినట్టు తెలుస్తోంది.

    మొత్తంగా ఈ సినిమా దగ్గరదగ్గరగా 60 కోట్ల గ్రాస్ రాబట్టేసినట్టు తెలుస్తోంది. అందులో సగానికిపైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోంచి ఉంది.మొత్తానికి ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి పుష్ప సగం పెట్టుబడిని తీసుకొచ్చేలా ఉంది. ఇక ఈ వీకెండ్ అయ్యే సరికి వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను రీచ్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

    Leave a Reply