- December 4, 2021
Akhanda Collections : అఖండ కలెక్షన్లు.. రెండో రోజూ విజృంభణే

Akhanda Collections బాలయ్య బాబు దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి బాక్సాఫీస్‌కు తెలిసి వచ్చింది. నేను దిగనంత వరకు.. దిగితే.. హిస్టరీ రిపిట్స్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ ఇప్పుడు పనికొస్తాయి. ఎందుకంటే అఖండ దెబ్బకు రికార్డులన్నీ మారిపోయేట్టున్నాయి. మొదటి రోజు ఏకంగా దాదాపు ముప్పై కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసింది. విడుదలైన అన్ని చోట్ల మాస్ రాంపేజ్ కనిపిస్తోంది.
ఓవర్సీస్‌లో మాత్రం అంతకు మించి అనే రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన ప్రతీ చోటా విదేశాల్లో జాతర కనిపించింది. బాలయ్య అభిమానుల సందడితో యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలు మార్మోగిపోయాయి. రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొత్తానికి బాలయ్య ఓవర్సీస్‌లో ఇట్టే గట్టెక్కేశాడని అర్థమవుతోంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండో రోజూ అదే ఊపు కనిపిస్తోంది. ఎక్కడా కూడా తగ్గట్లేదు. ప్రతీ చోటా థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపిస్తోంది. ఇక రెండో రోజూ కూడా దాదాపు 9-10 కోట్ల రేంజ్ గ్రాస్‌ను మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉంది, ఫైనల్ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ రోజు 10.5 కోట్ల నుండి 11 కోట్ల దాకా గ్రాస్‌ని సొంతం చేసుకునేలా ఉంది.
ఎలా చూసినా కూడా రెండో రోజుకు చేరుకుని సరికి అఖండ ఖాతాలో నలభై కోట్ల గ్రాస్ ఇట్టే కనిపించేట్టుంది. మొత్తానికి బాలయ్య విజృంభిస్తే ఎలా ఉంటుందో మరోసారి అఖండ నిరూపించేసింది. ఇలానే కొనసాగితే అఖండ దెబ్బకు రికార్డులన్నీ మటుమాయం అవుతాయి.
ఒక్కో ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందంటే.. నైజాంలో 10.5, సీడెడ్‌లో 10.6, ఉత్తరాంద్రలో 6, ఈస్ట్, 4, వెస్ట్ 3.5, గుంటూరు 5.4, కృష్ణా 3.7, నెల్లూరు 1.8కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్లకు అమ్ముడుపోయింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో మరో ఐదు కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్లకు అమ్ముడుపోయింది. అలా మొత్తంగా 53 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అలా మొత్తానికి అఖండ.. 54 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం కూడా మొదటి వీకెండ్‌లోనే వచ్చేట్టు కనిపిస్తోంది.