- December 3, 2021
Akhanda Day 1 Collections : అఖండ ఊచ కోత.. బాలయ్య స్టామినా ఇదే

Akhanda Day 1 Worldwide Collections బాలయ్య రంగంలోకి దిగితే బాక్సాఫీస్ ఎలా వణికిపోతుందో అఖండ మరోసారి నిరూపించింది. ఖండఖండాలు అఖండ సినిమా రికార్డులను కొల్లగొట్టేసింది. విడుదలైన ప్రతీ చోటా జాతరే. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. అదనపు షోలు లేకపోయినా, టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా కూడా ఏపీలో అఖండ దుమ్ములేపేసిందని తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్లో బాలయ్య మాస్ జాతర కనిపించింది. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ప్రతీ చోటా బాలయ్య హవా కనిపించింది. 3 కోట్ల రేంజ్లో గ్రాస్‌ను సొంతం చేసుకోవడం కన్ఫాం. ఇక మొత్తంగా లెక్కలు తెలియాలంటే ఇంకొంత సమయం పడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా అయితే ప్రభంజనం సృష్టించింది.
కేవలం ఒక్క నైజాంలోనే ఆల్ మోస్ట్ 7 కోట్ల నుంచి 7.5 కోట్ల రేంజ్లో గ్రాస్‌ను అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఏపిలో అయితే మొదటి రోజు 9 నుంచి 10 కోట్ల రేంజులో గ్రాస్ కొల్లగొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా ఏ లెక్కలో చూసుకున్నా కూడా మొదటి రోజే దగ్గరదగ్గరగా మొదటి రోజు 19-20 కోట్ల రేంజ్ గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. బాలయ్య మాస్ జాతర అంటే ఏంటో అందరికీీ తెలిసిపోయింది. అఖండమైన విజయంతో బాలయ్య మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు.
ఇవి కేవలం అంచనా లెక్కలే. అఫీషియల్ లెక్కల్లో ఇంకా ఎక్కువే వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి సెకండ్ వేవ్ తరువాత రిలీజైన భారీ చిత్రం ఇంత భారీ విజయాన్ని అందుకోవడంతో ఇండస్ట్రీ మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నట్టుంది. మిగతా అన్ని సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకం కుదిరినట్టు అయింది.
పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ వంటి సినిమాల కలెక్షన్లకు ఎలాంటి ఢోకా లేదని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఓమిక్రాన్ మళ్లీ విజృంభిస్తే.. ఆంక్షలు విధిస్తే పరిస్థితి తలకిందులవుతుంది. మున్ముందు పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.