- November 15, 2021
‘కురుప్’ క్లీన్ హిట్.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. దుమ్ములేపిన దుల్కర్
కురుప్ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతోనే అన్ని భాషల్లోకి వెళ్తున్నాం. పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఈ సినిమా కరోనా వల్ల వాయిదాలు పడుతూ వస్తుండటం బడ్జెట్ ఎక్కువైందని, అలానే వడ్డీ కూడా తడిసి మోపడైందని అన్నాడు. ఆ వడ్డీతోనే ఇంకో సినిమా తీయోచ్చని దుల్కర్ సెటైర్లు వేశాడు. అయితే తెలుగులో ఈచిత్రం దుమ్ములేపుతోందని తెలుస్తోంది.
సినిమాను తెలుగులో ఓన్ రిలీజ్ కాకుండా 60 లక్షల రేటుకి అమ్మారట. అలా మొత్తంగా 80 లక్షల టార్గెట్‌తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందట. అంతే కాకుండా ఈ మూడు రోజుల్లో కలెక్షన్లతోనే దాదాపు 14 లక్షలు లాభం వచ్చిందట. అంటే ఈ వారం ఇక ఎంత సాధించినా, ఎంత కొల్లగొట్టినా కూడా అవన్నీ లాభాల కిందకే వస్తాయన్న మాట. మామూలుగా ఈ వీకెండ్ కురుప్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.,
మొదటి రోజు మొదటి రోజు 38 లక్షలు, రెండో రోజు 40 లక్షల దాకా షేర్‌ని సాధించిందట. ఇక మూడో రోజు సినిమా 43 లక్షల దాకా షేర్‌ని కొల్లగొట్టేసి బ్రేక్ ఈవెన్ సాధించిందట. తెలుగు రాష్ట్రాలలో 1.21 కోట్ల షేర్ ని అలాగే 2.25 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇందులో కోటి దాకా గ్రాస్ కలెక్షన్స్ ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం అవ్వగా అక్కడే షేర్.. ఆల్ మోస్ట్ 62 లక్షల దాకా సొంతం అయ్యిందని తెలుస్తోంది. అలా మొత్తానికి ఒక్క నైజాం కలెక్షన్లతోనే సినిమా గట్టెక్కింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలేనని తెలుస్తోంది.