- January 16, 2022
Bangarraju Collection : బంగార్రాజు బాక్సాఫీస్ రాజు.. రెండో రోజు ఎంతంటే?
Bangarraju Second Day Collection బంగార్రాజు సినిమా సంక్రాంతి బరిలో దూసుకుపోతోంది. ఇప్పుడు సినీ అభిమానులకు ఒక్క బంగార్రాజు మాత్రమే ఆప్షన్‌గా మారింది. హీరో, రౌడీ బాయ్స్ సినిమాలను చూసే వాడే కరువయ్యారు. ఆ సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వాటికి వచ్చిన దారుణమైన టాక్ బంగార్రాజు సినిమాకు మరింతగా ప్లస్ అయ్యింది.
దీంతో అందరూ ఈ ఫెస్టివల్ మూడ్‌లో బంగార్రాజు సినిమాకే ఓటేస్తున్నారు. మొదటి రోజు బంగార్రాజు 17 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. అయితే రెండో రోజు కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయినట్టు కనిపిస్తోంది. ఈ రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
బంగార్రాజు రెండో రోజు ఏరియా వారిగా ఎంతెంత రాబట్టిందో చూద్దాం.. నైజాంలో 2.41 కోట్లు, సీడెడ్‌లో 1.66 కోట్లు, ఉత్తరాంద్రలో 93 లక్షలు, ఈస్ట్ 88 లక్షలు, వెస్ట్ 49 లక్షలు, గుంటూరు 61 లక్షలు, కృష్ణా 49 లక్షలు, నెల్లూరు 32 లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 7.79 కోట్ల షేర్, 13 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యాయి.
బంగార్రాజు రెండు రోజుల్లో ఏరియా వారిగా ఎంతెంత రాబట్టిందో చూద్దాం.. నైజాంలో 4.47 కోట్లు, సీడెడ్‌లో 3.46 కోట్లు, ఉత్తరాంద్రలో 2.20, ఈస్ట్ 1.75, వెస్ట్ 1.39, గుంటూరు 1.79, కృష్ణా 93 లక్షలు, నెల్లూరు 86 లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 16.85 కోట్ల షేర్, 27 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యాయి. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 18.85 కోట్ల షేర్.. 31.2 కోట్ల గ్రాస్ వసూళ్లను చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 33.80 కోట్లకు అమ్ముడుపోయింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 38.15 కోట్లకు సేల్ అయింది. అలా చూసుకుంటే 39 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్‌తో బంగార్రాజు బరిలోకి దిగింది. ఇంకా దాదాపు 20.15 కోట్లను కలెక్ట్ చేయాల్సి ఉంది.
- Tags
- Bangarraju 2 Days Collection
- Bangarraju 2 Days Worldwide Collection
- Bangarraju 2nd Day Collection
- Bangarraju 2nd Day Worldwide Collection
- Bangarraju Day 2 Total Collection
- Bangarraju Day 2 Worldwide Collection
- Bangarraju second Day Collection
- Bangarraju second Day Worldwide Collection
- Bangarraju Total 2 Days Collection
- Bangarraju రెండో రోజు కలెక్షన్
- Bangarraju రెండో రోజు కలెక్షన్లు
- Bangarraju రెండో రోజు కలెక్షన్స్
- Bangarraju సెకండ్ డే కలెక్షన్
- Bangarraju సెకండ్ డే కలెక్షన్లు
- Bangarraju సెకండ్ డే కలెక్షన్స్
- బంగార్రాజు
- బంగార్రాజు కలెక్షన్
- బంగార్రాజు కలెక్షన్స్
- బంగార్రాజు రెండు రోజుల కలెక్షన్స్
- బంగార్రాజు రెండో రోజు కలెక్షన్
- బంగార్రాజు రెండో రోజు వసూళ్లు
- బంగార్రాజు సెకండ్ డే కలెక్షన్