• December 16, 2021

‘పుష్ఫ’ థియేటర్ల లెక్క ఇదే.. మొదటి రోజు ఎంత కొల్లగొట్టబోతోందంటే?

‘పుష్ఫ’ థియేటర్ల లెక్క ఇదే.. మొదటి రోజు ఎంత కొల్లగొట్టబోతోందంటే?

    Pushpa Theatres Counts అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చలు నడుస్తున్నాయి. ఇంకొన్ని గంటలు గడిస్తే విదేశాల్లో పడుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు పడేందుకు సిద్దంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా తెలంగాణలో అయితే మరింత ముందుగా షోలు పడిపోనున్నాయి. ఇక బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు, రోజుకు ఐదు ఆటలు అంటూ తెలంగాణ ప్రభుత్వం వరాలఝల్లు కురిపించేసింది.

    Pushpa Day 1 Expected Worldwide Collection దీంతో నైజాం ఏరియాలో మొదటి రోజు కలెక్షన్ల మీద అందరి కళ్లు పడ్డాయి. ప్రపంచంలోని అన్ని ఏరియాల్లోకెల్లా పుష్ప సౌండ్ గట్టిగా నైజాంలోనే వినబడబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1100 థియేటర్లలో సినిమా విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు వేలకు పైగా థియేటర్లలో పుష్ప రిలీజ్ కాబోతోంది. ఇక మొదటి రోజే పుష్ప ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.

    పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో మాత్రం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పుష్ప మొదటి రోజు కలెక్షన్లు మాత్రం మామూలుగా ఉండబోవని అర్థమవుతోంది. కేవలం బుకింగ్స్‌తోనే హైద్రాబాద్‌లో మొదటి రోజు ఐదు కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ ప్రీమియర్లతోనే హాఫ్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసిందని తెలుస్తోంది.

    ఈ లెక్కన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70 కోట్ల గ్రాస్‌ను రాబట్టేట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన బన్నీ మాస్ రాంపేజ్ మొదటి రోజుతోనే మొదలవుతుందన్న మాట. మొత్తానికి పుష్ప మీద మాత్రం భార అంచనాలున్నాయి. దాదాపు 146 కోట్లకు పైగా షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. పుష్ప గనుక ఇదే స్పీడును మెయింటైన్ చేసి, కాస్త పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది.

    Leave a Reply