- January 20, 2022
అఖండ టోటల్ కలెక్షన్స్.. భారీ లాభాలను తెచ్చి పెట్టిన బాలయ్య

Akhanda Total 50 Days Collection నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశారు. ఇక ఇప్పుడు అఖండ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. సింహ,లెజెండ్‌లు బాలకృష్ణ అప్పటి కెరీర్ వరకు హయ్యస్ట్ కలెక్షన్లు సాధిస్తే.. అఖండ మాత్రం కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ గ్రాస్ సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ఉన్న కాలంలో ఓ సినిమా యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడటం మామూలు విషయం కాదు. ఏకంగా 103 కేంద్రాలలో అఖండ యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇది కేవలం టాలీవుడ్‌లోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమలోనే ఇది అరుదైన ఫీట్. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ లెక్కలు కలుపుకుంటే 200 కోట్లు రాబట్టేసింది.
ఈ మధ్య కాలంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటను పండించిన చిత్రంగా అఖండ నిలిచింది. ఓవర్సీస్‌లోనూ చిత్రం లాభాల బాట పట్టింది. యూకే, ఆస్ట్రేలియాలో సినిమా అద్బుతంగా ఆడగా.. అమెరికాలో అయమితే ఏకంగా వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసేసింది.
ఒమిక్రాన్ కేసులు పెరిగినా, పరిస్థితులు బాగా లేకపోయినా కూడా అఖండ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ప్రతీ వారం కొత్త సినిమాలు వచ్చినా కూడా అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే వచ్చింది. ఏడో వారంలో కూడా అఖండ మంచి వసూళ్లన రాబట్టింది.
టీం అంతా కలిసి అద్భుతంగా పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అతి పెద్ద బలంగా మారింది. సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ద్వారక ప్రొడక్షన్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ చేసేశాయి. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించారు. జగపతి బాబు ఓ ముఖ్య పాత్రను పోషించారు.