Akhanda Collection : అఖండ ఆరో రోజూ అదుర్స్.. బ్రేక్ ఈవెన్‌‌కు దగ్గర్లో బాలయ్య!

Akhanda Collection : అఖండ ఆరో రోజూ అదుర్స్.. బ్రేక్ ఈవెన్‌‌కు దగ్గర్లో బాలయ్య!

    Akhanda Day 6 Collection నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా రోజురోజుకూ పుంజుకుంటోంది. సినిమా థియేటర్లో జాతర కొనసాగుతూనే ఉంది. విడుదలైన వారానికి దగ్గరవుతున్నా కూడా ఏ మాత్రం హవా తగ్గడం లేదు. మొత్తానికి అఖండ బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది. ఆరు రోజుల్లోనే అఖండకు జరిగిని బిజినెస్, వచ్చిన రెవెన్యూ లెక్కలు సరిపోయాయి. ఇక రేపటి నుంచి లాభాల పంట పండిస్తుందన్న మాట.

    ఆరో రోజు అఖండ లెక్కలు ఇంకా అఫీషియల్‌గా రాలేదు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మూడు కోట్ల వరకు కలెక్ట్ చేసేట్టు కనిపిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఐదు రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. ఆరో రోజు లెక్కలు కూడా కలుపుకుంటే.. అది 85 కోట్ల వరకు వెళ్లొచ్చని తెలుస్తోంది. అలా మొత్తానికి ఆరు రోజుల్లోనే దాదాపు 52 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ రాబట్టేట్టు కనిపిస్తోంది.

    అఖండ ఆరో రోజు ఏరియా వారిగా ఎంత కలెక్ట్ చేసిందంటే.. నైజాంలో 91 లక్షలు, సీడెడ్‌లో 66లక్షలు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, ఈస్ట్ 18 లక్షలు, వెస్ట్ 14 లక్షలు, గుంటూరు 15 లక్షలు, కృష్ణా 14 లక్షలు, నెల్లూరు 9 లక్షలు ఇలా మొత్తంగా ఐదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2.53 కోట్ల షేర్‌ను, 4.10 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేయగా.. దాదాపు ఆరో రోజు కూడా అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది.

    మొత్తంగా ఈ ఆరు రోజుల్లో అఖండ ఎంత వసూల్ చేసిందో ఓ సారి చూద్దాం. మొదటి రోజున 15.39 కోట్లు, రెండో రోజున 6.83కోట్లు, మూడో రోజున 7.03కోట్లు, నాలుగో రోజున 8.31కోట్లు, ఐదో రోజున 3.58 కోట్లు, ఆరో రోజున 2.53 కోట్లు కొల్లగొట్టేసింది. అలా మొత్తంగా ఈ ఆరు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 43.67 కోట్ల షేర్, 68.90కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 51.82 కోట్ల షేర్.. 84.82 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

    ఒక్కో ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందంటే.. నైజాంలో 10.5, సీడెడ్‌లో 10.6, ఉత్తరాంద్రలో 6, ఈస్ట్, 4, వెస్ట్ 3.5, గుంటూరు 5.4, కృష్ణా 3.7, నెల్లూరు 1.8కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్లకు అమ్ముడుపోయింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో మరో ఐదు కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్లకు అమ్ముడుపోయింది. అలా మొత్తంగా 53 కోట్లకు అమ్ముడైన అఖండ.. 54 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగింది. మొత్తానికి ఆరో రోజుకు బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉంది.

    Leave a Reply