Akhanda Collection : నాల్గో రోజూ నలువైపులా సునామీ.. అఖండ దెబ్బకు రికార్డులు బద్దలు

Akhanda Collection : నాల్గో రోజూ నలువైపులా సునామీ.. అఖండ దెబ్బకు రికార్డులు బద్దలు

    Akhanda day 4 Collection అఖండ నాల్గో రోజు వసూళ్లు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయని తెలుస్తోంది. అఖండ నాలుగో రోజు లెక్కలు అంతకు మించి అనేలా ఉన్నట్టున్నాయి. మూడో రోజు కంటే అఖండ నాలుగో రోజు కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయని తెలుస్తోంది. మొత్తంగా అఖండ మాత్రం నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన మొదటి ఏరియాగా నైజాం నిలిచింది. మరోసారి నైజాంలో బాలయ్య సత్తా ఏంటో నిరూపించింది అఖండ.

    ఇక ఓవర్సీస్‌లో అయితే రెండో రోజే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ నాలుగు రోజుల్లో 750k డాలర్లను అఖండ కొల్లగొట్టేసింది. మొత్తానికి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా నాలుగో రోజు అఖండ థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఆదివారం కావడం, మంచి మాస్ మసాలా కమర్షియల్ సినిమా కావడంతో అందరూ అఖండకు ఓటేశారు.

    అలా నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాలోనే 8 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్‌గా 4వ రోజు అఖండ సినిమా 8.5 కోట్ల మేరకు కొల్లగొట్టేట్టు కనిపిస్తోంది. ఇక ఏరియాల వారిగా లెక్కలు కావాలంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. నైజాం ఏరియాలో 10.5 కోట్లకు అమ్ముడుపోయిన అఖండ మూడు రోజుల్లోనే 9.16కోట్లను కొల్లగొట్టేసింది. అలా ఆదివారం నాటితో నైజాం సేఫ్‌లోకి వచ్చింది.

    మూడో రోజు మాత్రం అఖండ ఒక్కో ఏరియాలో దుమ్ములేపేసింది.. నైజాంలో 2.51, సీడెడ్‌లో 1.78, ఉత్తరాంద్రలో 82లక్షలు, ఈస్ట్ 53 లక్షలు, వెస్ట్ 32 లక్షలు, గుంటూరు 43 లక్షలు, కృష్ణా 41 లక్షలు, నెల్లూరు 23 లక్షలతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 7.03 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. మొత్తంగా మూడో రోజు 11 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    అలా అఖండ మొదటి రోజు 15.39 కోట్లు, రెండో రోజు 6.83కోట్లు, మూడో రోజు 7.03 కోట్లు, నాలుగో రోజు 8.31కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో59.10 కోట్ల గ్రాస్, 37.56 కోట్ల షేర్‌తో దుమ్ములేపింది. ఇక నేటి లెక్కలతో కలుపుకుంటుంటే.. దాదాపు 40 కోట్ల షేర్‌ను అందుకోనున్నట్టు తెలుస్తోంది.

    నాలుగో రోజు మాత్రం అఖండ ఒక్కో ఏరియాలో రచ్చలేపింది.. నైజాంలో 2.95, సీడెడ్‌లో 2.03, ఉత్తరాంద్రలో 87లక్షలు, ఈస్ట్ 57 లక్షలు, వెస్ట్ 42 లక్షలు, గుంటూరు 55 లక్షలు, కృష్ణా 62 లక్షలు, నెల్లూరు 30 లక్షలతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 8.31 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. మొత్తంగా మూడో రోజు 13.80 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    ఒక్కో ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందంటే.. నైజాంలో 10.5, సీడెడ్‌లో 10.6, ఉత్తరాంద్రలో 6, ఈస్ట్, 4, వెస్ట్ 3.5, గుంటూరు 5.4, కృష్ణా 3.7, నెల్లూరు 1.8కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్లకు అమ్ముడుపోయింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో మరో ఐదు కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్లకు అమ్ముడుపోయింది. అలా మొత్తంగా 53 కోట్లకు అమ్ముడైన అఖండ.. 54 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగింది.

    Leave a Reply