Akhanda Collection : అఖండ హోరు.. మూడో రోజూ అదే జోరు

Akhanda Collection : అఖండ హోరు.. మూడో రోజూ అదే జోరు

    Akhanda Collection అఖండ మూడో రోజు కలెక్షన్లు దుమ్ములేచిపోయేలా ఉంది. అఖండ సినిమా రోజురోజుకు దూసుకుపోతోంది. కరోనా అనేది బాలయ్యకు అడ్డురావడం లేదు. థియేటర్ల వద్ద మాస్ జాతర జరుగుతోంది. మొదటి రోజే 30 కోట్ల దాక గ్రాస్ కొల్లగొట్టేసింది. రెండో రోజూ అదే జోరు కొనసాగించింది. దాదాపు 20 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. అలా మొత్తానికి రెండు రోజుల్లోనే దాదాపు సగం పెట్టుబడిని రాబట్టేసింది. ఇక మూడో రోజు కూడా అఖండ దుమ్ములేపేసింది.

    అఖండ రెండో రోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల గ్రాస్, 6.83 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఏరియా వారిగా అంటే నైజాంలో 2.26, సీడెడ్‌లో 1.98, ఉత్తరాంద్రలో 69లక్షలు, ఈస్ట్ 46 లక్షలు, వెస్ట్ 34 లక్షలు, గుంటూరు 41 లక్షలు, కృష్ణా 44 లక్షలు, నెల్లూరు 25 లక్షలతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 6.83 కోట్లను కొల్లగొట్టింది.

    అఖండ మూడో రోజు కలెక్షన్స్ ఇలా ఉండబోతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్‌లో షేర్ సాధించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌లో 650K మార్క్‌ని రీచ్ అయి బ్రేక్ ఈవెన్ కొట్టేసింది. అలా మొత్తానికి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు 7.5-8 కోట్ల రేంజ్‌లో కొల్లగొట్టేట్టు కనిపిస్తోంది.

    మూడో రోజు అఖండ ఒక్కో ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే.. నైజాంలో 2.51, సీడెడ్‌లో 1.78, ఉత్తరాంద్రలో 82లక్షలు, ఈస్ట్ 53 లక్షలు, వెస్ట్ 32 లక్షలు, గుంటూరు 43 లక్షలు, కృష్ణా 41 లక్షలు, నెల్లూరు 23 లక్షలతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 7.03 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. మొత్తంగా మూడో రోజు 11 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    అలా మొత్తంగా ఈ మూడు రోజుల్లో రెండు తెలుగా రాష్ట్రాల నుంచి 44.60 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. 29.25 కోట్ల షేర్‌ను సొంతం చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మరో వైపు ఓవర్సీస్‌లో 700k డాలర్లను రాబట్టింది. అంటే ఐదు కోట్లకు పైనే కలెక్ట్ చేసిందన్నట్టు. ఇలా మొత్తానికి మూడు రోజుల్లోనే 35 కోట్లకు దగ్గర్లో షేర్ రాబట్టి అఖండ దూసుకుపోతోంది.

    ఒక్కో ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందంటే.. నైజాంలో 10.5, సీడెడ్‌లో 10.6, ఉత్తరాంద్రలో 6, ఈస్ట్, 4, వెస్ట్ 3.5, గుంటూరు 5.4, కృష్ణా 3.7, నెల్లూరు 1.8కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్లకు అమ్ముడుపోయింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో మరో ఐదు కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్లకు అమ్ముడుపోయింది. అలా మొత్తంగా 53 కోట్లకు అమ్ముడైన అఖండ.. 54 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ మొత్తం కూడా మొదటి వీకెండ్‌లోనే వచ్చేట్టు కనిపిస్తోంది.

    Leave a Reply