• December 19, 2021

Pushpa Collection : ‘పుష్ప’ దెబ్బకు కనిపించని ‘అఖండ’.. 16వ రోజు ఎంత వసూల్ చేసిందంటే?

Pushpa Collection : ‘పుష్ప’ దెబ్బకు కనిపించని ‘అఖండ’.. 16వ రోజు ఎంత వసూల్ చేసిందంటే?

    Akhanda Day 16 Collection అఖండ సినిమా మాస్ జాతర రెండు వారాలు సాగింది. అఖండ ధాటికి చిన్న సినిమాలు గిలగిల్లాడాయి. పాపం లక్ష్య, గమనం సినిమాలు రోడ్డు రోలర్ కింద రాయిలా మారిపోయాయి. అఖండ దెబ్బకు లక్షల్లో కూడా రికవరీ చేసుకోలేకపోయింది. అలా అఖండ ప్రవాహాంలో ఆ రెండు సినిమాలు పత్తా లేకుండా పోయాయి. ఇక పుష్ప దెబ్బకు అఖండ మాయమైపోయే పరిస్థితి వచ్చింది.

    పుష్ప సినిమాకు టాక్‌‌తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. ఎందుకంటే పుష్ప మీదున్న అంచనాలతో ఈ వీకెండ్ మొత్తం టికెట్స్ సేల్ అయిపోయాయి. అలా మొత్తానికి ఈ మొదటి వీకెండ్ మాత్రం పుష్ప రాజ్.. నిజంగానే నీయవ్వ తగ్గేదే లే అని అంటాడు. ఇక సోమవారం నుంచి అసలు కథ మొదలవుతుంది. మొదటి రోజు పుష్ఫ రాజ్ దుమ్ములేపేశాడు.

    మైత్రీ మూవీస్ లెక్కల ప్రకారం పుష్ప మొదటి రోజే 71 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసింది. ఇతర ట్రేడ్ పండితులు మాత్రం 60 నుంచి 70 కోట్ల మధ్యలో ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పుష్ప మాత్రం కొన్ని చోట్ల ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేశాడు. నైజాం, ఓవర్సీస్ ఏరియాల్లో బన్నీ తన పట్టుని మరోమారు అందరికీ చూపించాడు.

    మొదటి రోజే నైజాంలో 11 కోట్ల షేర్ రాబట్టాడు. ఓవర్సీస్‌లో మొదటి రోజు, ప్రీమియర్స్ కలిపి వన్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టేశాడు. ఇక అఖండ సినిమాకు ఈ ఫీట్ చేరుకునేందుకు పది రోజుల పైనే పట్టింది. కానీ పుష్ప రాజ్ మాత్రం ఒక్క రోజులోనే రచ్చ చేశాడు. అయితే ఈ పదహారో రోజు అఖండకు 30 లక్షల లోపే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.

    ఎలాగూ అఖండ లాభాల బాట పట్టేసింది. కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చినా మేలే అన్నట్టుగా మారింది. కానీ పుష్ప తాకిడికి అఖండ థియేటర్లు ఖాళీ అవుతున్నాయట. కానీ కొన్ని చోట్ల మాత్రం అఖండ కూడా బాగానే నడుస్తోందని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం అయితే పుష్ప మొదటి రోజు 38.49 కోట్ల షేర్, 63 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు 21-22 కోట్ల రేంజ్ గ్రాస్‌ను అందుకోనుందని సమాచారం. అధికారిక లెక్కలు కావాలంటే ఇంకొద్ది సమయం ఆగాల్సిందే.

    Leave a Reply