- December 16, 2021
Akhanda Collection : ‘అఖండ’ ఇక క్లోజ్!.. 14వ రోజు అత్యంత దారుణం
Akhanda Day 14 Collection నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఊపు ఇప్పుడు కాస్త తగ్గింది. రెండు వారాలు కుమ్మేసిన ఇక అఖండ ఇప్పుడు చల్లబడింది. బాక్సాఫీస్ వద్ద యుద్దాన్ని చేసి అలసిపోయింది. ఇక పుష్ఫ రాజ్ ఆగమనం జరుగుతుండటంతో బాక్సాఫీస్ మరోసారి వణికిపోయేందుకు రెడీగా ఉంది. రేపటి నుంచి పుష్ప రాజ్ దాడి జరగబోతోంది. దాదాపుగా ఇవ్వాల్టితో అఖండ కలెక్షన్స్ క్లోజ్ అవుతాయి.
Akhanda 14th Day Collection అఖండ 14వ రోజు ఎంత కలెక్షన్ రాబట్టి తెలిస్తే షాక్ అవుతారు. పదమూడో రోజు మరింత తగ్గిన కలెక్షన్లు.. పద్నాలుగో రోజు కూడా అదే పరిస్థితిని కంటిన్యూ చేసింది. 14వ రోజు మొత్తం చూసుకుంటే దాదాపు కోటి వరకు గ్రాస్‌ను రాబట్టేట్టు కనిపిస్తోంది. అలా మొత్తానికి పద్నాలుగో రోజులు గడిచే సరికి అఖండ మంచి వసూళ్లనే రాబట్టేసింది.
పదమూడో రోజు అఖండ 74 లక్షలు కోటి ఇరవై లక్షల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. దాంతో మొత్తం పదమూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 54.48కోట్ల షేర్, 88.90 కోట్ల గ్రాస్ రాబట్టేసింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 63.88 కోట్ల షేర్ 109.5కోట్ల గ్రాస్ రాబట్టేసింది.
ఇక పద్నాలుగో రోజు లెక్కల్ని కూడా అందులో కలిపితే పెద్ద తేడా ఏమీ ఉండేట్టు కనిపించడం లేదు. పదమూడో రోజు కన్నా చాలా తక్కువ మొత్తం వచ్చినట్టు తెలుస్తోంది. 50 నుంచి 70 లక్షల షేర్.. కోటికిపైగా గ్రాస్ వచ్చినట్టుంది. అంటే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు రోజుల్లో 55కోట్లకు పైగా షేర్, 90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టేట్టు కనిపిస్తోంది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 64 కోట్ల షేర్, 110 కోట్లకు పైగా గ్రాస్ రాబటేట్టు తెలుస్తోంది.
అఖండ పద్నాలుగో రోజు ఏ ఏరియాలో ఎంతెంత వసూల్ చేసిందంటే.. నైజాంలో 16 లక్షలు, సీడెడ్‌లో పది లక్షలు, ఉత్తరాంద్రలో 5, ఈస్ట్ 3, వెస్ట్ 4, గుంటూరు 3, కృష్ణా 2, నెల్లూరు 2 లక్షలు అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల షేర్.. 75 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇది చాలా అత్యల్పం. రెండు వారాల్లో ఇంత మొత్తంగా రాబట్టడం ఇదే మొదటి సారి.
మొత్తానికి ఈ పద్నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఎంతెంత కొల్లగొట్టిందంటే.. నైజాంలో 18.25కోట్లు, సీడెడ్‌లో 13.97కోట్లు, ఉత్తరాంద్రలో 5.66, ఈస్ట్ 3.80, వెస్ట్ 3.13, గుంటూరు 4.40, కృష్ణా 3.32, నెల్లూరు 2.40కోట్లను రాబట్టింది. అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 54.93 కోట్ల షేర్.. 90కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. 64.73 కోట్ల షేర్, 112 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది.