• December 13, 2021

Akhanda Collection : అదరగొట్టిన ‘అఖండ’.. పదకొండో రోజూ థియేటర్లో జాతరే

Akhanda Collection : అదరగొట్టిన ‘అఖండ’.. పదకొండో రోజూ థియేటర్లో జాతరే

    Akhanda Day 11 Collection బాలయ్య అఖండ రెండో ఆదివారం దుమ్ములేపేసింది. కొత్త సినిమా విడుదలైతే థియేటర్లు ఎలా కళకళలాడుతుంటాయో.. అలానే అఖండ దెబ్బకు థియేటర్లన్నీ మార్మోగిపోయాయి. రెండో వారాంతం అఖండకు బాగా కలిసి వచ్చింది. గమనం, లక్ష్య వంటి సినిమాలు అఖండ వెలుగులో అస్సలు కనిపించలేదు. దీంతో మొదటి వారంలో అఖండ ఎలా అయితే కలెక్షన్ల వర్షం కురిపించిందో.. రెండో వారంలోనూ అలానే దూసుకుపోతోంది.

    ఈ పది రోజుల్లో అఖండ దెబ్బకు రికార్డులన్నీ మటుమాయమైపోయాయి. ఒక్కో ఏరియాలో రికవరీ సాధించేసి లాభాల్లోకి వచ్చింది. అన్నిటి కంటే ఎక్కువగా నైజాం ఏరియాలో రికవరీ చేసింది. అక్కడ దాదాపు 150శాతం రికవరీ అయినట్టు తెలుస్తోంది.

    Akhanda 11th Day Collectionఇక ఆదివారం నాడు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. దీంతో దగ్గరదగ్గరగా 2.8 కోట్ల నుంచి 3 కోట్ల రేంజ్ కలెక్షన్స్‌ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అఖంమ మేనియా ఉండటంతో 3.2 కోట్ల మార్క్‌ని కూడా టచ్ చేసే అవకాశం ఉంది.

    టోటల్ వరల్డ్ వైడ్‌గా దాదాపు 5.5 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను అందుకునే అవకాశం ఉంది. ఒక వేళ అదే నిజమైతే పదకొండో రోజు దెబ్బతో.. మొత్తంగా 105.5 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కొల్లగొట్టినట్టు అవుతుంది. పదకొండో రోజు.. నైజాంలో 91 లక్షలు, సీడెడ్ 76 లక్షలు, ఉత్తరాంధ్ర 35 లక్షలు, ఈస్ట్ 19 లక్షలు, వెస్ట్ 23 లక్షలు, గుంటూరు 25 లక్షలు, కృష్ణా 21 లక్షలు, నెల్లూరు 15 లక్షలు అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండో రోజు మొత్తంగా 3.05 కోట్ల షేర్.. 5.15 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసింది.

    అలా మొత్తానికి అఖండ పదకొండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 52. 90 కోట్ల షేర్.. 86. 35 కోట్ల గ్రాస్2ను రాబట్టింది. ఒక్కో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే.. మొదటి రోజు 15.39, రెండో రోజు 6.83, మూడో రోజు 7.03, నాలుగో రోజు 8.31, ఐదో రోజు 3.58, ఆరో రోజు 2.53, ఏడో రోజు 1.44, ఎనిమిదో రోజు 1.31, తొమ్మిదో రోజు 1.17, పదో రోజు 2.25, పదకొండో రోజు 3.08 కోట్లతో అఖండ దుమ్ములేపేసింది.

    ఇక ఏరియా వారిగా పద కొండు రోజుల్లో ఎంతెంత వసూల్ చేసిందంటే.. నైజాంలో 17.47 కోట్లు, సీడెడ్ 13.51, ఉత్తరాంధ్ర 5.43, ఈస్ట్ 3.68, వెస్ట్ 3.00, గుంటూరు 4.28, కృష్ణా 3.22, నెల్లూరు 2.31 అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 52.90 కోట్ల షేర్, 86.35 కోట్ల గ్రాస్‌తో దుమ్ములేపేసింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 61.97 కోట్ల షేర్, 105.8 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసి ఇంకా దూసుకుపోతోంది. మొత్తానికి పద కొండో రోజూ కూడా అఖండ తన సత్తా చాటేసింది. మరి ఈ వారం ఎలా ఉంటుందో చూడాలి. ఇక పుష్ప విడుదలయ్యే వరకు అఖండ మాత్రం ఈ ఊపు కంటిన్యూ చేసేలానే ఉంది.

    Leave a Reply