- October 30, 2021
ఏటీఏంకు వెళ్తే ఫోన్ తప్పనిసరా?.. ఇకపై అంతా అలానే

ఏటీఏంలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఎంతో మంది కార్డులు పోగొట్టుకోవడం, వెంటనే వారి ఖాతాల్లోంచి డబ్బులు మాయమవ్వడం వంటి వార్తలెన్నో చదివాం. అయితే వాటికి అడ్డు కట్ట వేసేందుకు ఎస్బీఐ మంచి ఆలోచన చేసింది. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవాలంటే కొత్త రూల్ పెట్టింది. కచ్చితంగా ఓటీటీ ఎంటర్ చేయాల్సిందేననే నిబంధనను పెట్టేసింది. దీంతో ఏటీఎంకు వెళ్తే ఫోన్ కచ్చితంగా తీసుకొని వెళ్లాల్సిందేనన్న మాట
పది వేల కంటే ఎక్కువగా తీయాలంటే ఈ నిబంధనను పాటించాల్సిందేనట. మోసాలను అరికట్టేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఎస్బీఐ ట్వీట్ వేసింది. ఏటీఎంలో కార్డు ఇన్‌సర్ట్ చేసి, డెబిట్ కార్డు పిన్ నంబర్, విత్‌డ్రా మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలని అడుగుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే క్యాష్ వస్తుందట. అయితే ఈ విధానంతో కొంతవరకు మోసాలను అరికట్టవచ్చు.