• October 17, 2021

నిమిషానికి ముకేష్ అంబానీ ఆర్జన అంతనా?

నిమిషానికి ముకేష్ అంబానీ ఆర్జన అంతనా?

    కొందరికి సమయం విలువ అస్సలే తెలియదు. కానీ కొందరు మాత్రం సెకన్లు, నిమిషాలను కూడా వృథా చేయరు. ఇక పరుగుపందెంలో పాల్గొనే వారికి అయితే మైక్రో సెకన్స్ విలువ తెలుస్తుంది. అలా ఒక్కో క్షణం కూడా ఉంటుంది. సెకన్‌కు కొన్ని లక్షలు, కోట్లు సంపాదించేవారున్నారు ఈ ప్రపంచంలో. మన దేశంలో అయితే అత్యధిక సంపాదన కలిగిన వారిలో ముకేష్ అంబానీ ముందుంటాడు.

    ఆయన గురించి చదవని రోజంటూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీతో ముకేష్ అంబానీ ఆసియా కుబేరుడుగా మారిపోయాడు. తాజాగా ఓ సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కో కంపెనీ నిమిషానికి ఎంత సంపాదిస్తోందనే సంగతులను వెళ్లడించింది. అందులో ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రస్థానంలో నిలిచింది. నిమిషానికి రూ 9.34 లక్షలు సంపాదిస్తోందట. టీసీఎస్, హెడీఎఫ్‌సీ వంటి సంస్థలు దాదాపు ఆరు లక్షలు ఆర్జిస్తున్నాయట.

    Leave a Reply