- October 23, 2021
సేవలకు అంతరాయం.. హెచ్చరించిన ఐటీ డిపార్ట్మెంట్

అప్పుడు కొన్ని సర్వర్లు పని చేయవు. సాంకేతిక సమస్యలు వస్తుండటం ఒక కారణం అయితే.. వాటిని రీ చెక్ చేయడం, నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా కొన్ని సార్లు సర్వర్లు పని చేయమని ముందే హెచ్చరిస్తారు. అలా నేడు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుగానే సూచించింది. వారి వెబ్‌సైట్ దాదాపు 12 గంటలపాటు నిలిచిపోనుందట.
శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్‌సైట్లో ప్రకటించింది. ఈ సమయంలో ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్‌సైటులో ఇతర సేవలూ అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది.
పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఆ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించి, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. వెబ్‌సైటులో తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే