• November 4, 2021

ఒకేసారి అంత తగ్గించేశారు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

ఒకేసారి అంత తగ్గించేశారు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

    ప్రస్తుతం మన దేశంలో పెట్రోల, డీజిల్ రేట్లకు ఎలా రెక్కలు వచ్చాయో అందరికీ తెలిసిందే. సెంచరీ కొట్టేసింది. పెట్రల్, డీజిల్ రెండు కూడా సెంచరీ దాటిపోయింది. దీనిపై ఆ మధ్య ఎన్నిరకాల కామెంట్లు, ట్రోల్స్,సెటైర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. పెట్రోల్ రేట్లు పెరగడంపై ఒక్కో పార్టీ ఒక్కోలా స్పందించింది. కేంద్రం తీసుకునే వాటా చాలా తక్కువ అని, రాష్ట్రాలు తమ వాటాను తగ్గించుకుంటే రేట్లు దిగి వస్తాయని ఇరు పార్టీల వాళ్లు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు.

    మొత్తానికి దీపావళి కానుకగా అనుకోవాలో ఏమో గానీ .. మొత్తానికి ఇంధన రేట్లు భారీగా తగ్గాయి. పెట్రోల్‌పై రూ. 5. డీజిల్ మీద రూ. 10 తగ్గించేసింది కేంద్రం. దీంతో హైద్రాబాద్‌లో పెట్రోల్ రేటు లీటరకు 114. 51 నుంచి 108.18కి, డిజీల్ రేటు 107.40 నుంచి 94.61కి తగ్గింది. మరి ఈ రేట్లు ఎన్ని రోజులుంటాయో చూడాలి.

     

    Leave a Reply