- October 27, 2021
ఎలన్ మస్క్ సెకన్‌కు అన్ని కోట్లు సంపాదించాడా?

ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని పేర్లు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆలీ బాబా గ్రూప్ అధినేతల పేర్లు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య ఒకరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎలన్ మస్క్ అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ మరో ఘనతను సాధించాడు.
ఎక్సాన్ మొబిల్ కార్ఫ్ కంటే.. ఎలన్ మస్క్ నికర విలువ అధికమైందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. సోమవారం ఎలన్ మస్క్ సంపద విలువ దాదాపు 288.6 బిలియన్ డాలర్ల (రూ. 21.64లక్షల కోట్టు)కు చేరుకుంది. హెర్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ ఏకంగా లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ పెట్టిన నేపథ్యంలో ఒక్కరోజులో ఆయన సంపద 36.2బిలియన్ డాలర్ల (రూ. 2.71లక్షల కోట్లు)కు చేరుకుంది. అంటే ఆయన సెకనుకు దాదాపు రూ. 3 కోట్లకు పైగా ఆర్జించినట్టు లెక్క.