- October 25, 2021
Bitcoin: పెరిగిన బిట్ కాయిన్ ధర

Bitcoin బిట్ కాయిన్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. కంటికి కనిపించిన ఈ కరెన్సీపై అందరూ మోజు పెంచుకుంటున్నారు. అయితే వీటి వల్ల ప్రమాదం ఉందని కొన్ని దేశాలు అధికారికంగా అంగీకరించడం లేదు. మన దేశం కూడా బిట్ కాయిన్ పట్ల అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. కానీ ఒక్కో బిట్ కాయిన్ ధర లక్షల్లో పలుకుతోంది. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర అమాంతం పెరిగింది.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ తమ కార్ల కొనుగోళ్ల చెల్లింపులకు బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తామంటూ చేసిన ప్రకటనతో, బిట్‌కాయిన్ విలువ అమాంతం దూసుకెళ్లి ఏప్రిల్ మధ్యలో 64895 డాలర్లకు చేరింది. ఆ తరువాత మళ్లీ అదే ఎలన్ మస్క్ చేసిన ప్రకటనతో కుప్పకూలిపోయింది. చైనా కూడా ఈ కరెన్సీపై బ్యాన్ విధించడంతో దెబ్బకు 30వేల డాలర్లకు పడిపోయింది.
అయితే బిట్‌కాయిన్ ఆధారిత ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదుకావడంతో మళ్లీ ఊపందుకుంది. గతంలో 64895 డాలర్లే అత్యధికం. కానీ ఇప్పుడు దాన్ని కూడా అధిగమంచింది. ఎన్‌ఎస్ఈలో నమోదు కావడంతో బిట్ కాయిన్ విలువ ఇప్పుడు 66,975 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.