• December 10, 2021

ట్విట్టర్‌లో స్టార్స్ హవా!.. ఈ ఏడాదిలో విజయ్, మహేష్ రచ్చ

ట్విట్టర్‌లో స్టార్స్ హవా!.. ఈ ఏడాదిలో విజయ్, మహేష్ రచ్చ

    Mahesh Babu-Thalapathy Vijay దళపతి విజయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ సపరేట్. ఈ ముగ్గురి అభిమానులు ట్విట్టర్‌లో చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఈ హీరోల బర్త్ డేలు, సినిమా అప్డేట్ల వస్తే ట్విట్టర్ మోత మోగిపోతోంది. అయితే ఈ ఏడాది కూడా సగం లాక్డౌన్‌లోనే గడిచిపోయింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో స్టార్స్ హవా పెరిగిపోయింది.

    విజయ్ బీస్ట్ సినిమా, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా, మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం, అజిత్ వలిమై ప్రాజెక్ట్‌లకు సంబంధించిన చర్చలే ఎక్కువగా జరిగాయట. ఈ మేరకు ట్విట్టర్ ఓ రిపోర్ట్‌ను ట్వీట్ చేసింది. ట్విట్టర్ ఇండియా ఈ మేరకు కొన్ని విషయాలను అందరికీ చెప్పేసింది. ఇందులో ట్విట్టర్‌లో స్టార్స్, వారి సినిమాలకు సంబంధించిన లెక్కలను చెప్పారు.

    2021 ఏడాదిలో ఎక్కువ హ్యాష్ ట్యాగులతో ట్రెండ్ అయిన సినిమాల లిస్ట్‌ను ట్విట్టర్ తెలిపింది. మొదటి స్థానంలో మాస్టర్ ఉంది. ఆ తరువాత వలిమై, బీస్ట్, జై భీమ్, వకీల్ సాబ్ సినిమాలున్నాయి. ఇక ఎక్కువగా కోట్ చేసిన ట్వీట్లలో మషేష్ బాబు సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ ఉందట. మోస్ట్ లైక్డ్, రీట్వీట్డ్‌గా బీస్ట్ ఫస్ట్ లుక్ నిలిచిందట.

    మొత్తానికి ట్విట్టర్ ఇండియా వదిలిన ఈ రిపోర్ట్‌తో అటు దళపతి ఫ్యాన్స్, ఇటు మహేష్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి విజయ్, మహేష్ బాబులకు సోషల్ మీడియాలో తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఈ ఇద్దరూ కూడా మంచి స్నేహితులే. ఆ మధ్య మహేష్ బాబు తన బర్త్ డే సందర్భంగా విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను విజయ్ స్వీకరించిన సంగతి తెలిసిందే.

    Leave a Reply