• December 10, 2021

Akhanda Day 8 Collection : ‘అఖండ’ వసూళ్లు.. ఎనిమిదో రోజుతో బ్రేక్ ఈవెన్

Akhanda Day 8 Collection : ‘అఖండ’ వసూళ్లు.. ఎనిమిదో రోజుతో బ్రేక్ ఈవెన్

    అఖండ ఎనిమిదో రోజూ కలెక్షన్స్ కాస్త తగ్గినా కూడా మొత్తానికి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకున్నట్టు కనిపిస్తోంది. వారం రోజుల కలెక్షన్లు చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు. ఇలాంటి సమయంలోనూ థియేటర్ల వద్ద భారీ జాతర జరుగుతుండటంతో ఇంకా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొత్తానికి అఖండ మాత్రం ఎనిమిదో రోజు అంటే Akhanda 8th Day Collection లెక్కలు కలుపుకుంటే బ్రేక్ ఈవెన్ కొట్టేసిందని తెలుస్తోంది.

    అఖండ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్లకు అమ్మేశారు. ఆ రేంజ్‌లొ బిజినెస్ జరగడం 54 కోట్ల టార్గెట్‌తో బాలయ్య బరిలోకి దిగడంతో ముందు అందరికీ అనుమానాలు వచ్చాయి. అసలు ఈ సమయంలో థియేటర్లోకి జనాలు వస్తారా? అని అంతా అనుకున్నారు. కానీ ఎనిమిది రోజుల్లోనే బాలయ్య ఆ టార్గెట్‌ను పూర్తి చేసేశాడు.

    వారం రోజుల్లో మొత్తంగా బాలయ్య ప్రపంచ వ్యాప్తంగా 53.49 కోట్ల షేర్, 87.9 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో బ్రేక్ ఈవెన్ మార్క్‌కు ఇంకో 51 లక్షలు కావాల్సి వచ్చింది. ఎనిమిదో రోజు వసూళ్లను కూడా కలుపుకుంటే.. బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బాలయ్య బయ్యర్లు సేఫ్ జోన్‌లోకి వచ్చేశారు.

    అఖండ 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్‌ని సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కోటి షేర్.. రెండు కోట్ల గ్రాస్ రాబట్టేట్టు కనిపిస్తోంది. మొత్తానికి బాలయ్య మాత్రం దుమ్ములేపేశాడు.

    ఎనిమిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా ఎంత కలెక్ట్ చేసిందంటే.. నైజాంలో 35 లక్షలు, సీడెడ్‌లో 25 లక్షలు, ఉత్తరాంధ్రలో 12 లక్షలు, ఈస్ట్ 7 లక్షలు, వెస్ట్ 6 లక్షలు, గుంటూరు 7 లక్షలు, కృష్ణ 6.2 లక్షలు, నెల్లూరు 5 లక్షలు కలెక్ట్ చేసింది. అలా మొత్తంగా ఎనిమిదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1.03 కోట్ల షేర్.. 1.65 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    మొత్తంగా ఈ ఎనిమిది రోజుల్లో ఒక్క ఏరియాలో నుంచి ఎంత రాబట్టిందంటే.. నైజాంలో 15.22 కోట్లు, సీడెడ్‌లో 11.98, ఉత్తరాంధ్రలో 4.68, ఈస్ట్ 3.15, వెస్ట్ 2.49, గుంటూరు 3.80, కృష్ణ 2.79, నెల్లూరు 2.03 కోట్లు కలెక్ట్ చేసింది. అలా మొత్తంగా ఎనిమిది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 46.14 కోట్ల షేర్.. 72.95 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. ఓవర్సీస్‌లో 4.58 కోట్లు, రెస్టాప్ ఇండియాలో 3.85 కలుపుకుంటే.. మొత్తంగా 54.57 కోట్ల షేర్, 90 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తానికి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను బాలయ్య దాటేశాడు. ఇకపై వచ్చేదంతా లాభాలే.

    Leave a Reply