- December 9, 2021
Akhanda Collection : అఖండ ఊపు తగ్గిందా?.. ఏడో రోజుతో బ్రేక్ ఈవెన్!
Akhanda 7th Day Collection అఖండ సినిమా ఏడో రోజు కలెక్షన్స్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. గత వారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. అయితే ఆరు రోజుల్లో కళ్లు చెదిరే కలెక్షన్లను కొల్లగొట్టింది. మొత్తంగా ఈ ఆరు రోజుల్లో అఖండ ఎంత వసూల్ చేసిందో ఓ సారి చూద్దాం. ఈ ఆరు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 43.67 కోట్ల షేర్, 68.90కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 51.82 కోట్ల షేర్.. 84.82 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
అలా మొత్తానికి బాలయ్య బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చాడు. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా మూడు కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. అలా షేర్ 54 కోట్లు దాటితే సినిమా బయటపడ్డట్టే. ఇప్పటికే దాదాపు 52 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఈ ఏడో రోజు లెక్కలు కూడా కలుపుకుంటే.. బ్రేక్ ఈవెన్ సాధించినట్టే అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Akhanda Day 7 Collection అఖండ ఏడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల రేంజ్‌లో రాబట్టేట్టు కనిపిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు రెండు కోట్ల వరకు షేర్‌ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా కూడా నేటితో బాలయ్య బ్రేక్ కొట్టేస్తాడని అర్థమవుతోంది.
ఏడో రోజు వసూళ్లు కాస్త తగ్గినా కూడా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను బాలయ్య దాటేసేట్టు కనిపిస్తోంది. ఒక్కో ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందంటే.. నైజాంలో 10.5, సీడెడ్‌లో 10.6, ఉత్తరాంద్రలో 6, ఈస్ట్, 4, వెస్ట్ 3.5, గుంటూరు 5.4, కృష్ణా 3.7, నెల్లూరు 1.8కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్లకు అమ్ముడుపోయింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో మరో ఐదు కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్లకు అమ్ముడుపోయింది. అలా మొత్తంగా 53 కోట్లకు అమ్ముడైన అఖండ.. 54 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగింది. మొత్తానికి ఏడో రోజుకు బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని ఏరియాలు సేఫ్ జోన్‌లోకి వచ్చినట్టు టాక్.