• December 8, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ఇళ్లు వదిలి రోడ్డు మీద పడ్డ కార్తీక్ కుటుంబం.. ఇక వంటలక్కే దిక్కా?

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ఇళ్లు వదిలి రోడ్డు మీద పడ్డ కార్తీక్ కుటుంబం.. ఇక వంటలక్కే దిక్కా?

    karthika deepam serial today Episode కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే.. బుధవారం నాటి ధారావాహిక అంటే.. Karthika Deepam Epiosde 1217 నాడు గుండెలు పిండేసే సీన్లు పడ్డాయి. కట్టుకున్న భార్య, పిల్లలను నడిరోడ్డు మీద కార్తీక్ నడిపించుకుంటూ వెళ్లాడు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా లెటర్ రాసి తన కుటుంబాన్ని తీసుకుని వచ్చేశాడు. ఇక వంటలక్కగా మారి మళ్లీ తన భర్త, పిల్లలను పోషించేట్టు కనిపిస్తోంది. కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా కొనసాగిందో ఓ సారి చూద్దాం.

    కార్తీక్, దీప, శౌర్య, హిమలు రోడ్డు మీదకు వచ్చేస్తారు. మనం టూర్‌కు వెళ్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకు అని పిల్లలు అడుగుతారు.. తాతయ్య, నానమ్మలకు చెబితే మనకు సెండాఫ్ ఇచ్చేవాళ్లు కదా? అని పిల్లలంటారు. చెబితే సర్ ప్రైజ్ ఏముంటుంది? అని కార్తీక్ తన ధీనపరిస్థితి గురించి పరోక్షంగా చెబుతాడు. ఓహో సర్ ప్రైజా? అని పిల్లలు తెగ సంబరపడిపోతారు..

    నాకు చాలా సర్ ప్రైజ్‌లు వచ్చాయి.. అందుకే వాళ్లకు సర్ ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చేశామని కార్తీక్ అంటాడు.. మన టూర్‌కు వెళ్తే కారులో విమానం వెళ్లేవాళ్లం కదా? కానీ ఇలా ఎందుకు నడుస్తున్నామని మళ్లీ ప్రశ్నిస్తారు. ఎప్పుడూ కారులో, విమానంలో వెళ్లే వాళ్లం కదా? కానీ ఇప్పుడు ఇలా నేల మీదకు తీసుకొద్దాం నడిపిద్దామని అనుకున్నానంటూ కార్తీక్ తన బాధను లోలోపలే దిగమింగుకుంటాడు.

    నానమ్మ తాతయ్యలను తరువాత రమ్మంటారా? అని మళ్లీ పిల్లలు అడుగుతారు..చలికాలంలో వాళ్లను ఇబ్బంది పెట్టకూడదు. అందుకే వారు రారు అని దీప చెబుతుంది. మనం ఇప్పుడు ఏ బస్టాండ్‌కు వెళ్దాం.. ఎక్కడికి వెళ్దాం.. అని ఇలా పలు రకాలుగా ప్రశ్నలు సంధిస్తుంటారు. ఇంతలో కార్తీక్‌కు ఫోన్ వస్తుంది. కార్తీక్ దూరంగా వెళ్తుంటే.. దీప మాత్రం వదిలి వెళ్లకండని అడుగుతుంది.

    అలా కార్తీక్ కొంత దూరం వెళ్లి ఫోన్ పాడేస్తాడు. ఇక్కడేమో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుారు. మన టూర్‌కు వెళ్దామని అన్నాం.. ఇక్కడ అక్కడ అని లేదు.. ఎక్కడికెళ్తే అక్కడే అదే టూర్.. ఏ బస్ ముందు వస్తే అది ఎక్కేస్తాం అని దీప చెప్పడంతో బాగుంది.. బాగుంది..కొత్తగా విచిత్రంగా ఉంటుంది అని పిల్లలు సంబరపడిపోతారు. అలా వచ్చిన బస్‌లో ఎక్కేస్తారు. అక్కడ ఓ పిచ్చోడు.. కార్తీక్ పాడేసిన ఫోన్‌ను తీసుకుంటాడు.

    అక్కడ సీన్ కట్ చేస్తే మోనిత, ప్రియమణి మీద ఓపెన్ అవుతుంది. ఏంటి ప్రియమణి అప్పుడే పడుకున్నావ్ అని ప్రియమణిని లేపుతుంది మోనిత.. పడుకోనివ్వండమ్మ టైం ఎంత అవుతుందో తెలుసా? అని ప్రియమణి అంటే.. టైం బాగుందని చెప్పడానికి వచ్చాను అంటూ మోనిత తెగ ఎగ్జైట్ అవుతుంది.. ఏం జరిగిందో చెప్పండమ్మ అని అనడంతో జరిగిన విషయం అంతా చెబుతుంది మోనిత..

    అంటే ఇప్పుడు కార్తీక్ అయ్య డాక్టర్ బాబు కాదా? అని ప్రియమణి ఆశ్చర్యపోతోంది. అయినా మీ పగ దీపమ్మ మీద కదా?. కార్తీక్ అయ్యను ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రియమణి అంటుంది. నా లాజికి నీకు ఇంకా అర్థం కాలేదు.. మగాడికి పెద్ద శిక్ష ఏంటంటే.. పనీపాట లేకుండా ఖాళీ ఇంట్లో ఉండటం.. ఇంకెంత కాలం ఖాళీగా ఉంటావ్ అని పెళ్లాం అని అంటే భరించలేడు..

    సంపాదన లేని మగాడు పేపర్ పులి లాంటి వాడు.. కార్తీక్‌ని నేను సున్నాగా మార్చేస్తాను ప్రియమణి.. మానసికంగా చంపేందుకు కత్తులు, కటార్లు అవసరం లేదు.. బ్రెయిన్ చాలు.. జీరోగా మారిన కార్తీక్‌ను నా వద్దకు తీసుకురావచ్చు.. నా హాస్పిటల్‌లో పెట్టుకుంటాను.. బంధనాలు బిగిస్తాను.. దీపకు అష్టదిగ్భంధనం చేస్తాను అంటూ మోనిత అనుకుంటుంది.

    అక్కడ సీన్ ఓపెన్ చేస్తే.. సౌందర్య, ఆనంద్ రావులు వాకింగ్ కోసం బయటకు వెళ్లేందుకు సిద్దమవుతారు. రాత్రి మీరు చెప్పినట్టు చేద్దాం.. వాడు డబ్బులు ఇస్తే తీసుకోడు.. ఐదు కోట్లు ఇచ్చి బిజినెస్ పెట్టిద్దాం అని సౌందర్య అంటుంది.. వాళ్లు బిజినెస్‌లో ఎక్కడికో వెళ్తారు.. ఈ విషయంల దీపకు చెబితే ఎంతో సంతోషిస్తారు అని ఆనంద్ రావు అంటాడు.. దీప ఎక్కడున్నావ్ రావే.. అని పదే పదే సౌందర్య పిలుస్తుంది. దీప వంట గదిలో లేనట్టుంది అని ఆనంద్ రావు అంటే..

    ఏంటండి అది నా పెద్ద కోడలు.. అందరికంటే ముందు లేచి.. చివరన పడుకుంటుంది.. కష్టజీవి.. అని సౌందర్య అంటుంది. ఏంటత్తయ్య కాఫీ కావాలా? అని శ్రావ్య వస్తుంది. వద్దు శ్రావ్య.. దీప వంటగదిలో లేదా? అని అడుగుతుంది. లేదు అత్తయ్య నాకు కనిపించలేదు.. నేనూ ఇందాకే లేచాను అని శ్రావ్య అంటే.. ఇద్దరూ కలిసి వాకింగ్‌కు వెళ్లారా?.. మనం వాకింగ్‌కు వెళ్దాం.. వచ్చాక మాట్లాడుకుందాం మని సౌందర్య, ఆనంద్ రావులు బయటకు వెళ్లేందుకు సిద్దపడతారు.

    కానీ కార్తీక్ రాసిన లెటర్ శ్రావ్య కంటపడుతుంది. బావగారు.. అంటూ ఏడ్చేస్తుంది శ్రావ్య. ఇంతలో ఆ లెటర్ చూసి సౌందర్య ఖంగుతింటుంది. మమ్మీ ఏంటిది అని ఆదిత్య అడుగుతాడు.. ఇక ఆ లెటర్‌లో ఇలా ఉంది.. మమ్మీ డాడీ.. పెద్దోడా అని ఎంతో ప్రేమగా పిలిచే ఈ పెద్దోడు.. ఎన్నో పెద్ద తప్పులు చేశాడు.. శిక్ష మీకు పడింది.. ఈసారి అలా జరగకూడదని నా తప్పులకు నేనే శిక్షను అనుభవించాలని వెళ్తున్నాను.. నేను కన్నందుకు కట్టుకున్నందుకు దీప, పిల్లలకు తప్పదు కదా?. ఎక్కడికి వెళ్తాను.. ఏమవుతానో నాకు తెలీదు.. పిల్లలకు తెలీదు.. నాకోసం వెతకొద్దు.. నా కోసం బాధపడొద్దు..

    ఉన్నన్ని రోజులు అన్ని రకాలుగా బాధపడ్డారు.. జీవితంలో అలిసిపోయానో.. ఓడిపోయానో.. ఏమైపోతోన్నానో.. నాకే అర్థం కాని పరిస్థితి.. మమ్మల్ని లెక్కలోకి తీసుకోకండి.. మీకు ఒకే కొడుకు అనుకోండి.. ఒక్కడే మనవడు.. దీపుగాడు అనుకోండి.. ఒకే కోడలు శ్రావ్య అనుకోండి.. నేను ఓడిపోయాను.. ఎవ్వరికీ మొహం చూపించలేకవెళ్లిపోతోన్నాను.. మీ ఆరోగ్యం జాగ్రత్త.. శ్రావ్య, ఆదిత్య, దీపులను బాగా చూసుకోండి.. నేను పేరుకే ఇంటికి పెద్దోడిలా మిగిలాను.. బాధ్యతలను కరెక్ట్‌గా నిర్వర్తించలేదు.. ఇట్లు మీకు ఎన్నో తలవొంపులు తెచ్చిన నిజంగా పెద్దోడు కాలేకపోయిన మీ పెద్దోడు అని రాసి ఉంది.

    ఇదేంట్రా పెద్దోడ.. నువ్వెళ్లిపోవడం ఏంట్రా అని సౌందర్య ఏడుస్తుంటుంది.. ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొస్తాను అని ఆదిత్య అంటాడు. తప్పి పోయిన వాళ్లని వెతకొచ్చు.. కావాలని వెళ్లిన వాళ్లని ఎలా పట్టుకుంటావ్ రా అని ఆనంద్ రావు అంటాడు.. ఏమైనా చేసి అన్నయ్య, వదిన, పిల్లలను పట్టుకొస్తాను అని ఆదిత్య అంటాడు.. ఎవరికి కనిపించకుండా వెళ్లిన వాళ్లని ఎక్కడని వెతుకుతాం..

    బావగారేంటి ఇలా చేశారు అని శ్రావ్య ఏడుస్తుంది.. పెద్దోడు అన్నట్టుగా వాడు నిజంగానే జీవితంలో ఓడిపోయాడండి.. అని సౌందర్య అంటే.. దీప పక్కన ఉన్నంత వరకు వాడు ఓడిపోడు .దీప గెలిపిస్తుంది.. పదకొండేళ్లు ధైర్యంగా ఒంటరిగా పోరాటం చేసింది.. ఇప్పుడు కార్తీక్ పక్కన తనుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్తీక్ కోసం దీప పోరాడుతుంది.. దీప పక్కన ఉన్నన్ని రోజులు కార్తీక్ ఓడిపోడు సౌందర్య అని ఆనంద్ రావు ధైర్యాన్నిస్తాడు.అలా ఎపిసోడ్ కూడా ముగుస్తుంది.

    ఇక కార్తీక్, దీప ఏదో ఊరుకి వెళ్లినట్టున్నారు. అక్కడ వారికి మరి కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇంట్లోకి కార్తీక్, దీప వెళ్లారు. మీరు ఎవరు.. ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదే అని ఓ మహిళ అంటుంది. కొత్తగా వచ్చాం.. ఏదైనా పని దొరుకుతుందేమోనని.. అని దీప అంటుంది. ఈ ఇళ్లు ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా? మీరు తెలీక వచ్చారు అని ఓ కొత్త కారెక్టర్ ఎంట్రీ గురించి చెబుతోన్నట్టుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply