• December 6, 2021

అలాంటి వీడియోలెన్నో చూశా!.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్

అలాంటి వీడియోలెన్నో చూశా!.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్

    Rashmika Mandanna రష్మిక మందన్నా నెట్టింట్లో చేసే అల్లరి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇక రష్మీ తన ఫ్యాన్స్ కోసం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. లైవ్‌లోకి వస్తుంది. అప్పుడప్పుడు పోల్ పెడుతుంది. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి.. ఏం చేయబోతోన్నానో చెప్పండంటూ ఇలా పజిల్ క్వశ్చన్స్ వేస్తుంటుంది.

    ఇప్పుడు రష్మిక సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పుష్ప పాటలతో నెట్టింట్లో రష్మిక మార్మోగిపోతోంది. ఇక మొన్న వదిలిన పుష్ప టీజర్ టీజ్‌లో రెండు మూడు షాట్లలోనే కనిపించింది. కానీ అందరినీ కట్టిపడేసింది. అయితే తాజాగా రష్మిక ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఇన్ స్టా రీల్ వీడియోలు ఎంత ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే.

    పుష్ప సినిమాలోని సామీ అనే పాట ఇప్పుడు హాట్ కేకులా మారిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆ పాటకు రీల్ వీడియోలు చేస్తూ రష్మికను ఇమిటేట్ చేస్తున్నారు. కొన్ని లక్షల రీల్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఓ బుల్లి పాప చేసిన రీల్ వీడియోకు రష్మిక ఫిదా అయింది.

    ఆ బుల్లి పాప చేసిన రీల్ వీడియోను రష్మిక షేర్ చేస్తూ.. ఇలాంటి వీడియోలు ఎన్నో చూశాను. కానీ ఇప్పుడు మాత్రం నాక్కూడా ఈ రీల్ వీడియో చేయాలని ఉంది.. ఆ పాప స్టైల్, స్వాగ్‌ను మ్యాచ్ చేసేందుకు ట్రై చేస్తానంటూ రష్మిక తెగ సంబరపడిపోయింది. ఏ మాటకామాటే గానీ ఆ బుజ్జి పాప మాత్రం క్యూట్‌గా స్టెప్పులు వేసింది.

    Leave a Reply