• December 5, 2021

Anasuya Bharadwaj: అనసూయ తండ్రి మృతి.. ఆయన ఎలాంటి వారో చెప్పిన యాంకర్

Anasuya Bharadwaj: అనసూయ తండ్రి మృతి.. ఆయన ఎలాంటి వారో చెప్పిన యాంకర్

    Anasuya Bharadwaj యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు (63) అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన సొంత నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అనసూయ తండ్రి గత కొన్నేళ్ల నుంచి క్యానర్స్‌తో బాధపడుతున్నారు. నేడు ఆయన తుది శ్వాస విడిచారు. అనసూయ ఇప్పుడు పుట్టెడు దు:ఖంలో ఉంది.

    తన తండ్రి ఎలాంటి వారో గతంలో అనసూయ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాము ముగ్గురం కూడా ఆడపిల్లలమేనని, అయినా కూడా ఎప్పుడూ ఆడపిల్లల్లా పెంచలేదని అనసూయ తెలిపింది. ధైర్యంగా ఉండాలని, మగాళ్లతో సమానంగా ఉండాలని ధైర్యాన్ని నింపేవారని తన తండ్రి గురించి అనసూయ ఎంతో గొప్పగా చెప్పింది.

    ఇక చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లే సమయంలోనూ ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నానో, ధైర్యంగా మాట్లాడుతున్నానా? లేదా? అని మూలన దాక్కుని మరీ చూసేవారట. అయితే ప్రేమ విషయాన్ని మాత్రం తండ్రికి చెప్పేందుకు అనసూయ తెగ భయపడిందట. ఇంట్లో తన అమ్మకు తన ప్రేమ విషయం తెలిసినా కూడా తండ్రికి మాత్రం తెలియకుండా గుట్టుగానే ఉంచిదట.

    చివరకు ప్రేమ విషయం తెలియడం, తన తండ్రి అంగీకరించకపోవడం బయటకు వచ్చి అనసూయ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్లీ కొన్నేళ్లకు కుటుంబం అంతా కూడా కలిసిపోయింది. కానీ ఇలా తన తండ్రిని అనసూయ కోల్పోవడంతో ఆమె అభిమానులు దు:ఖిస్తున్నారు.

    Leave a Reply