• November 25, 2021

Shiva Shankar Master : శివ శంకర్ మాస్టర్‌కు కరోనా.. ఆస్పత్రి ఖర్చుకు కూడా

Shiva Shankar Master : శివ శంకర్ మాస్టర్‌కు కరోనా.. ఆస్పత్రి ఖర్చుకు కూడా

    Shiva Shankar Master సీనియర్ మోస్ట్ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు బాగా లేదు. ఆయనకు కరోనా సోకడం ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కనీసం ఆస్పత్రి ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్నారట. ఇక ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురుచూస్తున్నారట.

    ఈ మేరకు శివ శంకర్ మాస్టర్ తనయుడు అజయ్ కృష్ణ కాంటాక్ట్ నంబర్‌ను కూడా షేర్ చేశారు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే 9840323415 ఈ నంబర్‌ను సంప్రదించవల్సిందని ఇండస్ట్రీలోని వ్యక్తులను కోరారు.

    4 రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది.
    వైద్య ఖర్చుల నిమిత్తం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయట. కరోనాతో హోమ్ క్వారెంటైన్లో‌ ఆయన భార్య ఉండగా.. అపస్మారక స్థితిలో పెద్ద కొడుకు ఉన్నారని తెలుస్తోంది. చిన్నకొడుకు అజయ్ కృష్ణ తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నాడట.

    Leave a Reply