- November 24, 2021
Anchor Vishnu Priya : మూడ్ బాగా లేదన్న విష్ణుప్రియ.. అలా కూడా కలిసి వచ్చిందన్న హాట్ యాంకర్

Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగిందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో ఎక్కడో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఉండే విష్ణుప్రియ బుల్లితెర, వెండితెర, ఓటీటీ ఇలా అన్ని చోట్లా అదరగొట్టేస్తోంది. ఇన్ని రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉంటూ వచ్చిన విష్ణుప్రియ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో బిజీగా మారింది. పాతికేళ్లలో ఎంత సంపాదించాలో అంత కంటే ఎక్కువే సంపాదించుకున్నాను.. అందుకే అన్ని ప్రాజెక్ట్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చాను అని ఆ మధ్య విష్ణుప్రియ చెప్పింది.
కొన్ని రోజుల క్రితం విష్ణుప్రియ ఎక్కడా కనిపించేది కాదు. బుల్లితెరపై సందడి తగ్గించింది. కేవలం యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం అంటూ అప్పుడప్పుడు కనిపించేది. స్పిరిట్యువల్ దారిలోకి కూడా విష్ణుప్రియ వెళ్లిపోయింది. ఈ మధ్యే త్రయంబకం అంటూ దైవ దర్శనాలు చేసుకుంది. అయితే విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ ఫుల్ బిజీగా మారింది. బుల్లితెరపై షోలు చేస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తోంది
అయితే తాజాగా విష్ణుప్రియ మూడ్ బాగా లేదని తెలిపింది. బ్యాడ్ మూడ్ అంటూ చెప్పుకొచ్చింది. లక్కీ సెట్‌లో ఈ రోజూ ఏడ్చే సీన్ ఉందంట. అలా తన మూడ్ ఈ రోజుకు ఇలా కుదిరిందని, బాధపడుతూ ఉండటంతో కలిసి వచ్చిందని విష్ణుప్రియ పేర్కొంది. కానీ తన మూడ్ ఎందుకు అలా ఉంది? అసలు తనకు ఏమైంది? అన్న విషయాలు మాత్రం తెలియడం లేదు. షూటింగ్‌లొ ఉంది? మూడ్ బాగా లేదు.. ఈరోజు ఏడ్చే సీన్లే చేశాను అని మాత్రమే విష్ణుప్రియ చెప్పింది.
ఈ మధ్యే ఆహాలో చేసి ది బ్యూటీ అండ్ బేకర్స్ వెబ్ సిరీస్ విష్ణుప్రియకు మంచి పేరే తీసుకొచ్చింది. ఆమె పలు వెబ్ సిరీస్‌లు, బుల్లితెరపై ప్రాజెక్ట్‌ల ఆఫర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా విష్ణుప్రియ మాత్రం ఇటు సోషల్ మీడియాలో అటు బుల్లితెరపై మంచి ఫాంలో ఉంది.