• November 23, 2021

ఇది కదా కోరుకుంది!.. అలీతో బ్రహ్మానందం

ఇది కదా కోరుకుంది!.. అలీతో బ్రహ్మానందం

    బుల్లితెరపై ఆలీతో సరదాగా షోకు ఓ విశిష్టమైన పేరు ఉంది. ఈ షోను ఇండస్ట్రీలో చాలా మంది ఫాలో అవుతుంటారు. ఈ షోకు గెస్టుగా వెళ్లడమే ఓ గొప్ప అచ్చీవ్ మెంట్‌లా ఫీలవుతుంటారు. అయితే ఈ మధ్య సెలెబ్రిటీలను తీసుకురావడంలో కాస్త అలసత్వం వహించినట్టు అనిపించింది. ఒకప్పుడు అయితే కేవలం సీనియర్ తారలు, కనుమరుగవుతున్నా ఒకప్పటి తరాన్ని పిలిచేవారు. కానీ నిన్న మొన్న వచ్చిన వాళ్లను కూడా ఈ షోకు పిలిచేస్తున్నారు.

    అయితే ఈ షో అభిమానులు మాత్రం కొన్నేళ్ల నుంచి కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. వడ్డే నవీన్, వేణు తొట్టెంపూడి, బ్రహ్మానందం వంటి వారిని తీసుకురండి అంటూ రిక్వెస్ట్‌లు చేస్తూ వచ్చారు. రిక్వెస్ట్‌లు కాస్తా డిమాండ్ అయింది.. డిమాండ్ కాస్త వార్నింగ్ అయింది. కానీ ఆలీతో సరదాగా టీం మాత్రం వీక్షకుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. యూట్యూబ్‌లో కొన్ని వేల కామెంట్లలో ఇదే కనిపిస్తుంది. ఎన్ని సార్లు అడిగినా కూడా వాళ్లను ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నిస్తుంటారు.

    మొత్తానికి ఆ సమయం వచ్చింది. బ్రహ్మానందాన్ని ఈ షోకు గెస్టుగా తీసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా ఆ షో అభిమానులు ఎదురుచూసిన తరుణం వచ్చింది. మొత్తానికి బ్రహ్మానందం, ఆలీ కలిసి ఈ షోలో ఫుల్ సందడి చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ చిన్న పాటి టీజర్ను వదిలారు. ఇందులో ఇద్దరు లెజండరీ కమెడియన్లు సందడి చేశారు.

    బ్రహ్మానందం వస్తున్నాడంటే సెటప్ ఎలా ఉంటుంది.. ఎంట్రీ ఎలా ఉంటుందనేది అందరూ ఊహించుకోగలరు. అంతకు మించి అనేలా ఉంది. బ్రహ్మానందం కోసం గట్టిగానే ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది.ఇక ఆలీ, బ్రహ్మానందం కలిసి స్టెప్పులు కూడా వేశాడు. బ్రహ్మానందంతో ఎలాంటి విషయాలను బయటకు రప్పిస్తాడో చూడాలి.

    Leave a Reply