- November 18, 2021
Guppedantha Manasu Episode 298 : అంత జరిగినా బయటపడడు.. వసు విషయంలో ఎటూ తేల్చుకోలేని రిషి
గుప్పెడంత మనసు సీరియల్లో గురువారం మంచి సీన్ జరిగింది. రిషి తన మనసులో మాటను బయటపెట్టేస్తాడని అంతా అనుకుంటారు. తండ్రి మహేంద్ర ఎన్ని రకాలుగా ప్రశ్నించే.. మనసులో ఉన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ని రకాలుగా మాటలు అన్నా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో మహేంద్ర చేతులెత్తేస్తాడు. నీ చావు నువ్ చావు అన్నట్టుగా.. ఇక మార్చలేమన్నట్టుగా రిషిని మహేంద్ర వదిలేస్తాడు. గురువారం నాడు అంటే 298వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకునేరు.. ఇప్పుడు పడుకో.. అని వసుని జగతి కాస్త శాంత పరుస్తుంది. ఆ తరువాత జగతికి కాస్త అనుమానం పెరుగుతుంది. ఏం జరుగుతోంది మహేంద్ర అని జగతి అడుగుతుంది.. ఏంటి జగతి.. అని మహేంద్ర అంటాడు. ఇదేంటి మహేంద్ర.. వసు పడిపోవడం ఏంటి? రిషి తీసుకురావడం ఏంటి? అని జగతి అంటుంది. నేను ఏదో అనుకుంటే.. ఇంకా ఏదో అవుతోంది.. నా ప్లాన్ వికటిస్తుందా? దగ్గరవుతుందని అనుకుంటే దూరమవుతున్నారా? అని మహేంద్ర తనలో తాను అనుకుంటాడు. ఇద్దరి మధ్యా ఏం జరిగింది అని జగతి అడుగుతుంది.. నన్ను అడుగుతావ్ ఏంటి? అని మహేంద్ర అంటాడు. నీకు తెలీకుండా జరిగిందని నేను అనుకోను మహేంద్ర.. అని జగతి నిలదీస్తుంది. నాకేం తెలుస్తుంది.. అని మహేంద్ర అంటాడు. నా దగ్గర ఏం దాచడం లేదా? అని జగతి.. నీ దగ్గర దాచడానికి ఏం లేదు.. ఒకటి అరా ఉన్నా ఇప్పుడేం చెప్పలేను.. అని మహేంద్ర కవర్ చేస్తాడు. సమాధానం చెప్పకుండా వెళ్తున్నావ్..అని జగతి అంటే.. సమయం కాదని అంటున్నాను.. నీ దగ్గర దాచి పెట్టడానికి ఏం లేదు.. అని వెళ్లిపోతాడు మహేంద్ర.
ఇక రిషి తన ఇంట్లో వసు అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు రిషి.. తప్పుగా అర్థం చేసుకుని నేను బాధపడ్డాను.. అంత కంటే ఎక్కువగా తనను బాధపెట్టాను.. ఎలా ఉందో ఏంటో..ఫోన్ చేసి మాట్లాడాలా? పడుకుని ఉందా? మెసెజ్ చేయాలా?.. జగతి మేడంకు ఫోన్ చేయాలా? డాడీ ఇంకా రాలేదా?.. వస్తే నా దగ్గరకు రాకుండా ఉంటాడా? ఇందులో వసు తప్పు కూడా ఉంది.. శిరీష్ పెళ్లి వేరే అమ్మాయితో అని ఆ ముక్కే చెబితే ఇదంతా ఉండేదా?.. అని రిషి ఇలా పలు విధాలుగా తనలో తాను అనుకుంటూ ఉంటాడు.
డాడీ.. వసుధార శిరీష్ పెళ్లి అని నాతోఎందుకు అబద్దం చెప్పారు అని మహేంద్ర వచ్చీరాగానే రిషి అడిగేస్తాడు.. ఏంటి రిషి.. వసుధారకు శిరీష్‌తో పెళ్లి అని ఎప్పుడు చెప్పాను అని మహేంద్ర అంటాడు.. రాయబారాలు మాట్లాడింది మీరు కాదా? అని రిషి అంటాడు. ఇదే తొందరపాటు.. దీని వల్లే ఇంత వరకు వచ్చింది.. ఏం చెప్పానో ఓసారి గుర్తు తెచ్చుకో.. అని అంటాడు. ఇందులో ఎవ్వరి తప్పు లేదు.. నీ తప్పే.. అని మహేంద్ర అంటాడు. నా తప్పు ఎలా.. అని రిషి అంటాడు.
శిరీష్ పెళ్లిలో అన్నింటా వసు ముందుంది.. అమూల్యతో ఎంగేజ్మెంట్ జరిగింది కానీ నువ్ రంగుల అద్దం వెనక నుంచి చూసినట్టు ఊహించుకున్నావ్. నువ్ అనుకున్నరంగులోంచి చూశావ్.. అలానే కనిపించింది.. నీ ఆలోచనలో తప్పు ఉంది.. అది నీ తప్పు. రిషి .. ఆనందం అంటే ఏంటో తెలుసా? మనస్ఫూర్తిగా బతకడం.. కష్టాల్లేకుండా బతకడం అని కాదు. కష్టాలున్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని.. అన్నీ ఒప్పుకుని ఓపెన్లా ఉండటం అంటే మన వసుధారలా.. అన్నీ మనసులోనే దాచుకుంటావ్.. చెప్పవ్.. చెప్పలేవు.. ఇగో ప్రాబ్లమో? ఇంకోటో నాకు తెలియదు.. అని మహేంద్ర అంటాడు.
శిరీష్ పెళ్లి వేరే అమ్మాయితో అని నాకు చెప్పొచ్చు కదా?.. అని రిషి అంటాడు. మళ్లీ మళ్లీ మొదటికొస్తున్నావ్.. రిషి. నువ్ నన్ను అడిగావా? వసుని అడిగావా? శిరీష్‌ని అడిగావా? శిరీష్ వచ్చాడు.. మన ఇంటికి వచ్చాడు.. ఆఫీస్‌కి వచ్చాడు.. నువ్ కలవలేదు.. ఎందుకు.. నీ ఆలోచనలో ఉన్న పొరబాటు వల్ల.. వసును దారుణంగా క్షోభ పెట్టావ్.. ఒక్క మాట చెప్పనా?.. ఎంగేజ్మెంట్కి వచ్చావ్.. ఇంకో రెండు అడుగులు ముందుకు వస్తే.. ఆ రోజే నీకు నిజం తెలిసేది కదా?.. మళ్లీ వచ్చావ్ అంటా.. వచ్చిన వాడివి లోపలకి వస్తే అమూల్య కనిపించేది కదా?.. అని మహేంద్ర పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు.
ఒక్క మాట అయినా కూడా మీరు చెప్పాలి కదా? అని రిషి అడుగుతాడు.. వసుధార శిరీష్‌ల పెళ్లి అని నువ్ ఫీల్ అవుతున్నాను? అని నాకు ఒక్క మాట అయినా కూడా చెప్పావా? ఆ టాపిక్ కూడా తీయలేదు.. కదా? మనసులో ఏదో అనుకుని బాధ పడితే ఏం జరుగుతుంది.. రిషి.. ఇలా బాధపెరుగుతుంది. నిజంగానే వసుకి శిరీష్‌కి పెళ్లి అనుకుందాం.. నీకు వచ్చిన నష్టం ఏంటి? నిజంగానే వసుధార పెళ్లి చేసుకుంటే.. ఏంటంటా?.. వసుధార పెళ్లి చేసుకుంటే ఏంటంటా? అని రిషిని పదే పదే గుచ్చి గుచ్చి అడిగేస్తాడు మహేంద్ర
అలా ఎలా చేసుకుంటుంది అని రిషి అంటాడు.. తప్పేంటి? నీకు చెబితే నువ్ ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ ఏం చేయగలవు అని రెచ్చగొడతాడు మహేంద్ర. నేనేం అనను అని రిషి చెబుతాడు. అనవ్ నాకు తెలుసు. అన్నీ మనసులో అనుకుంటావ్. మనసులోనే అనుకుంటావ్.. అని మహేంద్ర అంటాడు. రిషి నువ్ మారవ్ రా అని మనసులో మహేంద్ర బాధపడతాడు.. ఎప్పుడూ మనం చెప్పేది కాదు.. ఎదుటి వాళ్లు చెప్పేది విను.. ఎవ్వరికీ క్లారిటీ ఉన్నా లేకపోయినా.. నీకు నువ్ క్లారిటీ ఉండాలి.. అనుమానులుంటే నివృత్తి చేసుకోవాలి లేదంటే. ఇలానే తుఫాను పుడుతుంది.. ఇప్పటికైనా అర్థం చేసుకో.. అని రిషికి క్లాస్ పీకి వెళ్లిపోతాడు మహేంద్ర.
అక్కడ సీన్ కట్ చేస్తే తెల్లారి వసు, జగతిలు మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు రిషి సర్.. నన్ను ఎందుకు అలా చూస్తున్నాడో నాకు అర్థమైంది. కారణం తెలిసింది.. ప్రశ్నించాను.. కానీ సమాధానం రాలేదు.. రిషి సర్ నా ప్రమేయం లేకుండా ఏదో అనుకున్నారు.. ఊహించుకున్నారు.. శిరీష్‌తో నా పెళ్లి అని అనుకుంటున్నారు.. అలా ఎవరు చెప్పారో అర్థంకావడం లేదు.. ప్రశ్నలు అడిగాను.. కానీ సమాధానాలు రాలేదు అని వసు అంటుంది.. మనసు ఎన్నో అడుగుతుంది.. కానీ.. పరిస్థితులు అనుకూలించవు అని జగతి అంటుంది..
శిరీష్‌తో నా పెళ్లి అని తెలిసి డిస్టర్బ్ అయ్యారు.. నన్ను బాధపెట్టారు.. అని వసు చెబుతుంది. రిషి మనసులో వసు ఉందన్నది నిజం. కానీ రిషి ఒప్పుకోడు.. ఇద్దరి పరిచయం ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందనే భయం.. నేను ఊహించిందే జరుగుతుందా?.. వసు మనసులో ఏముందో తెలియదు.. జరిగిన దాంట్లో మహేంద్ర ప్రయాణం ఎంతుంది? అని జగతి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. సమస్యలు పరిష్కరించుకునేందుకు ధైర్యంగా ఉండటం మంచిదే.. వర్షం అలా మొండిగా తడవడం అవసరమా? అని జగతి అంటుంది. అలా ఉన్నందుకే కొంత పరిష్కారం దొరికింది కదా? మేడమ్ అని వసు అంటుంది.. శిరీష్‌తో నా పెళ్లి అని చెప్పింది ఎవరో కనుక్కుంటాను.. నేనేంటో నా జీవితమేంటో.. నా లక్ష్యమేంటో తెలిసి కూడా నన్ను అలా ఊహించుకున్నారు.. అదే నాకు బాధగా ఉందని వసు అంటుంది.. నేను చెప్పాల్సింది చెప్పాను.. నేను ప్రేమను చూపించగలను.. కానీ అధికారన్ని ప్రదర్శించలేను..అని జగతి వెళ్లిపోతోంది. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే రిషిని వసు హగ్ చేసుకుని బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. నన్ను దూరం పెట్టకండి.. నాపై కోపం చూపెట్టకండని వసు అలా ఘాడంగా హత్తుకుని మాట్లాడుతుంది. అయితే నిజమా? కలనా? అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.