• November 9, 2021

పని మనిషిగా మారిన లాస్య భర్త!.. మంజునాథ్ పరిస్థితి దారుణం

పని మనిషిగా మారిన లాస్య భర్త!.. మంజునాథ్ పరిస్థితి దారుణం

    బిగ్ బాస్ షోతో లాస్య మళ్లీ ఫాంలోకి వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో లాస్య చేసిందేమీ లేదు కానీ చివరకు వంటలక్కగా పేరు సంపాదించుకుంది. బిగ్ బాస్ ఇంట్లో వంటలు చేయడం.. అభిజిత్, హారిక, నోయల్‌‌లతో కలిసి ముచ్చట్లు పెట్టడం తప్పా లాస్య చేసిందేమీ లేదు. అలా మొత్తానికి లాస్య బిగ్ బాస్ ఇంట్లో బాగానే నెట్టుకొచ్చింది. దాదాపు ఐదారేళ్లు బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన లాస్యకు బిగ్ బాస్ మంచి బూస్టప్ ఇచ్చింది. మళ్లీ లాస్య బుల్లితెరపై బిజీగా మారింది.

    సోషల్ మీడియాలో మళ్లీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక యూట్యూబ్ చానెళ్‌తో లాస్య బాగానే సంపాదిస్తోంది. ఆ మధ్య లాస్య చేస్తోన్న యూట్యూబ్ వీడియోలు బాగా పాపులర్ అవ్వడంతో ఎవరో హ్యాక్ చేసినట్టున్నాడు. మొత్తానికి యూట్యూబ్ చానెల్ హ్యాక్ అవ్వడంతో లాస్య కిందామీద పడిపోయింది. ఇప్పుడు లాస్య చేస్తున్న వీడియోల సంగతి అందిరికీ తెలిసిందే. ఏ సందర్భం వచ్చినా, ఈవెంట్ వచ్చినా, పండుగలు వచ్చినా కూడా ఓ వీడియో చేసి పడేస్తోంది.

    వాటికి మిలియన్ల వ్యూస్ కూడా వస్తున్నాయి. అందుకే తన భర్తను కూడా యూట్యూబ్ కోసం వాడేస్తున్నట్టు కనిపిస్తోంది. నటనలోకి తన భర్త మంజునాథ్‌ను కూడా లాగేసింది. పనోడి కారెక్టర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. యూట్యూబ్లో ఏదో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.. చిన్నగా ఏదైనా ఓ వీడియోను చేస్తోందో గానీ భర్తతో నటింపజేస్తోంది. మంజునాథ్ కూడా కెమెరా ముందు బాగానే నటిస్తున్నాడు. మొత్తానికి భర్తతో కలిసి లాస్య ఇలా వీడియోల మీద వీడియోలు వదులుతోంది.

    రానున్న రోజుల్లో ఈ ఇద్దరే కలిసి వెబ్ సిరీస్‌లు చేస్తారేమో చూడాలి. మొత్తానికి యూట్యూబ్‌ను వాడటంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు చాలా ముందుంటున్నారు. అందులో లాస్య, అరియానా, శివజ్యోతి, మెహబూబ్, రోహిణి వంటి వారు యూట్యూబ్ మీద బతికేస్తున్నట్టు కనిపిస్తుంది.

    Leave a Reply