- November 9, 2021
ఫోన్లో అలాంటి యాప్స్ వాడుతుందా?.. కార్తీక దీపం మోనిత మామూల్ది కాదు
కార్తీక దీపం సీరియల్లో విలన్‌గా బుల్లితెరను ఏలేస్తోంది శోభా శెట్టి. మోనిత పాత్రలో శోభా శెట్టి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. మోనిత లేకపోతే కార్తీక దీపం సీరియల్ లేదనేంతగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు సీరియల్ మొత్తం కూడా మోనిత చుట్టే తిరుగుతోంది. మొత్తానికి కార్తీక్ భార్యగా మారాలని, పుట్టిన బిడ్డను అడ్డం పెట్టుకుని కొత్త నాటకాలు ఆడుతోంది మోనిత. అలా సీరియల్లో అందరినీ ఆటాడిస్తున్న మోనిత.. నెట్టింట్లో మాత్రం శోభాశెట్టిగా అలరిస్తోంది.
తెరపై మాత్రమే మోనితగా శోభా శెట్టి విలనిజాన్ని ప్రదర్శిస్తుంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన మంచి పనులు, మంచి మనస్తత్వంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. శోభా శెట్టి కన్నడ నటి అయినా కూడా తెలుగు బాగా నేర్చుకుంది. బాగా మాట్లాడుతోంది కూడా. అలా నెట్టింట్లో శోభా శెట్టి తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఇక యూట్యూబ్ చానెళ్ల ద్వారా అయితే శోభా శెట్టి విపరీతంగా ఆర్జిస్తోన్నట్టు కనిపిస్తోంది.
ఇంత వరకు తెలుగు యూట్యూబ్ చానెల్ మాత్రం మెయింటైన్ చేసింది కానీ ఇప్పుడు ఇప్పుడు కన్నడలో కూడా కొత్త యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. అలా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా శోభా శెట్టి దూసుకుపోతోంది. అయితే తాజాగా శోభా శెట్టితన సీక్రెట్లను బయటపెట్టేసింది. తన ఫోన్లో ఏ ఏ యాప్స్ వాడుతోందో బయటకు వచ్చింది.
ఆమె తన ఫోన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. అందులో తన ఫోన్ వాల్ పేపర్, కొన్ని యాప్స్ బయటపడ్డాయి. వాచ్, ట్రాన్సలేటర్, మ్యూజిక్, మూవీస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆప్, ఇన్ స్టా, ఆరోగ్య సేతు, అమెజాన్, ఫోన్ పే వంటి యాప్స్ అన్నింటిని ఇన్ స్టాల్ చేసుకుంది. మొత్తానికి మోనితకు మాత్రం మెసెజ్‌ల వర్షం కురిసినట్టుంది. దాదాపు 3600కు పైగా మెసెజ్‌లు వచ్చి ఉన్నాయి. వాటిని చూసే తీరిక ఆమెకు లేనట్టు కనిపిస్తోంది.