- October 30, 2021
Aryan Khan Drugs case : బయటకు వచ్చిన ఆర్యన్ ఖాన్

డ్రగ్స్ కేసులో ఇన్ని రోజులు జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ మొత్తానికి బయటకు వచ్చాడు. అక్టోబర్ 3న జరిగిన క్రూయిజ్ పార్టీలో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ లభించలేదు. అతని స్నేహితుల వద్ద ఆరుగ్రాముల వరకు దొరికినట్టుంది. వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లాడంటూ ఆర్యన్ ఖాన్ తరుపు లాయర్ వాదించాడు ఇన్ని రోజులు. ఎన్సీబీ అధికారులు మాత్రం ఆర్యన్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, నిత్యం డ్రగ్స్ వాడుతాడని చెప్పారు.
ఆతని వాట్సప్ ఆధారంగానే అనన్య పాండేను కూడా విచారించారు. డ్రగ్స్ గురించి చాట్ చేసినట్టు అందులో తేలింది. కానీ నిరూపించేందుకు ఆధారాలు లభించలేదు. డ్రగ్స్ గురించి సరదాగా చాట్ చేశామని అనన్య తెలిపింది. అయితే ఈ కేసులో షారుఖ్ ఖాన్ తన కొడుకుని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.గత మూడు నాలుగు వారాలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ విఫలమయ్యాడు. చివరకు ముకుల్ రోహత్గి ఎంట్రీతో కథ మారింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్ని రోజులు ఇలా విచారిస్తారు.. ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ సమయంలో డ్రగ్స్ లభించలేదు.. పైగా డ్రగ్స్ శరీరంలో ఉన్నట్టుగా కూడా తెలియదు.. పరీక్షలు కూడా చేయలేదు అంటూ వాదించేశాడు. వాట్సప్ చాట్ ఆధారంగా ఇలా చేస్తారా? అంటూ మొత్తానికి బెయిల్ వచ్చేట్టు చేశాడు. గురువారమే బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.
కానీ బెయిల్ పత్రాలు సమర్పించడంతో విఫలమవ్వడంతో శనివారం విడుదలయ్యాడు ఆర్యన్ ఖాన్. అతని బెయిల్ కోసం జుహీ చావ్లా లక్ష రూపాయల పూచీ కత్తుతో జామీను ఇచ్చింది. మొత్తానికి కొడుకు రాకతో జన్నత్ మొత్తం కాంతులతో మెరిసిపోయింది. కొడుకు రాకతో షారుఖ్ ఇంట్లో ఆనందం వెల్లువిరిస్తోంది.