• October 26, 2021

ఆ సీన్ చేసేటప్పుడు మా నాన్న చూశాడు.. హార్ట్ ఎటాక్ వచ్చింది.. అసలు విషయం చెప్పిన షకీలా

ఆ సీన్ చేసేటప్పుడు మా నాన్న చూశాడు.. హార్ట్ ఎటాక్ వచ్చింది.. అసలు విషయం చెప్పిన షకీలా

    షకీలా జీవిత చరిత్ర గురించి అంతా తెలిసిందే. స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఫేమస్ అయి, ఎక్కువ సంపాదించిన షకీలా ఇప్పుడు ఎందుకు అనామకురాలిగా మిగిలిందో? చేతిలో డబ్బులు లేకుండా ఎందుకు అద్దె ఇంట్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని స్వతాహాగా చేసుకున్న కర్మలు అయితే.. ఇంకొన్ని కుటుంబ సభ్యులు నమ్మించి మోసం చేసిందే. సొంత అమ్మ,అక్కలే షకీలాను నిండా ముంచారు. ఎక్కువగా చదువుకోక పోవడంతో ఆర్థిక లావాదేవీల గురించి షకీలాకు అంతగా తెలియదు.

    చిన్నప్పుడు కుటుంబ షోషణ కోసం, కుటుంబాన్ని నడిపించడం కోసం షకీలా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు అలాంటి పాత్రలు నటించేసింది. డబ్బులు బాగా సంపాదించింది. షకీలా అంటే స్టార్ హీరోలు కూడా భయపడి తమ సినిమాలను విడుదల చేసే వారు కాదు. అలా షకీలా ఎన్నో కోట్లు సంపాదించింది. కానీ షకీలా అమ్మ, అక్కలు మాత్రం వాటిని స్వాహా చేశారు. చివరకు షకీలాకు ఏమీ మిగల్చలేదుట.

    ఈ విషయాలన్నీ షకీలా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా సుమ క్యాష్ షోలో షకీలా గెస్టుగా వచ్చింది. మామూలుగా ఇలాంటి షోలకు షకీలా రావడం అరుదు. కానీ సుమ షో కాబట్టి వచ్చినట్టుంది. అందులో షకీలా తన జీవిత గాథను చెబుతూ.. నాన్న గురించి కొన్ని విషయాలు చెప్పి అందరినీ ఏడిపించేసింది.

    నాన్నకు నేనంటే చాలా ఇష్టం.. నాక్కూడా నాన్నంటే చాలా ఇష్టం. నేను పడ్డ కష్టాలు చూశాడు.. నేను ఓ సారి షూటింగ్‌‌లో బిల్డింగ్ మీద నుంచి జంప్ చేయాలి.. అప్పుడు డోప్ లేదు.. నేను ఎక్కి దూకేశాను.. కాళ్లు విరగ్గొట్టుకున్నాను.. ఆ సీన్ చూసి నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చింది.. ఇకపై సినిమాలు ఏవీ చేయోద్దని అన్నాడు అంటూ అందరినీ కంటతడి పెట్టించేసింది షకీలా.

    Leave a Reply