• October 23, 2021

IPL 2022 : రెండు కొత్త జట్ల కోసం అన్ని వేల కోట్లా?

IPL 2022 : రెండు కొత్త జట్ల కోసం అన్ని వేల కోట్లా?

    వచ్చే ఏడాది ఐపీఎల్ మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటి వరకు ఉన్న ఎనిమిది జట్లను పది వరకు పెంచనున్నారు. అంటే రెండు జట్లు కొత్తగా రానున్నాయి. అహ్మదబాద్, లక్నో జట్లతో ఆ టీంలు రాబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రంగంలోకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఆ రెండు జట్లను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ కూడా బరిలోకి దిగినట్టు తెలుప్తోంది.

    ఈ రెండు ఫ్రాంచైజీల కోసం మొత్తం 11 సంస్థలు పోటీ పడుతున్నాయని అందులో అదాని గ్రూప్ ఒకటి. గ్లెజర్ ఫ్యామిలీ కూడా పోటీలో ఉందట. ఈ రెండు కూడా దాదాపు ఏడు వేల కోట్ల నుంచి పది వేల కోట్ల వరకు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయట. ఈ మేరకు బీసీసీఐ అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. 2010లో పుణె వారియర్స్, కొచ్చి టస్కర్స్, 2016, 2017 సమయంలో రైజింగ్ ఫుణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ అనే తాత్కాలిక జట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

    Leave a Reply