• March 8, 2026

‘దండోరా’  తెలుగు వాళ్ల ప్రతిభను చాటే చిత్రం – థాంక్యూ మీట్‌లో హీరో శివాజీ

‘దండోరా’  తెలుగు వాళ్ల ప్రతిభను చాటే చిత్రం – థాంక్యూ మీట్‌లో హీరో శివాజీ

    తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం నాడు చిత్రయూనిట్ థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ థాంక్యూ మీట్‌లో..

    శివాజీ మాట్లాడుతూ .. ‘మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైంది. మార్క్ కె రాబిన్‌ గారికి అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి థాంక్స్. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. మురళీగారు ‘దండోరా’ కథని, మూవీని మా కోసమే తీశాడనిపిస్తుంది. ఈ పాత్ర కోసం, లుక్ కోసం నేను చాలా వరకు రాత్రి పూట రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడ్ని. నటన అంటే దైవంతో సమానం. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా నేను చేసే వాడ్ని కాదు. నవదీప్, నందు, బిందు మాధవి ఇలా అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

    దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ .. ‘మా ‘దండోరా’ సినిమాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, ప్రభుత్వానికి థాంక్స్. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా టీంలోని ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కొత్త దర్శకుడిని అయినా సరే నా టీం అంతా నన్ను నమ్మింది. ఎంతో అనుభవం ఉన్న యాక్టర్స్ సైతం నాకు చాలా సపోర్ట్ చేశారు. మార్క్ కె రాబిన్ మా సినిమాకి ప్రాణం. ఆయన, నేను కలిసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాకు పని చేశాం. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. శివాజీ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది. ఎక్కడా, ఏనాడూ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. కనీసం కేరవ్యాన్ కూడా ఆయన అడగలేదు. ఆయనలాంటి మంచి వ్యక్తి, గొప్ప ఆర్టిస్టులు మనకు అవసరం. ఈ సినిమా చూసి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు పర్సనల్‌గా నాకు ఫోన్ చేసి అభినందించారు. ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తే మరింత మంచి చిత్రాల్ని, సందేశాత్మాక సినిమాల్ని తీయాలనే ప్రోత్సాహం లభిస్తుంది’ అని అన్నారు.

    నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ మాట్లాడుతూ .. ‘‘దండోరా’ సినిమాని గుర్తించి, అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీ మెంబర్లకి, తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. మా ‘దండోరా’ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహు గారికి, నాగవంశీ గారికి థాంక్స్. మాకు ముందు నుంచీ అండగా నిలిచిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

    మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ .. ‘ముందు నుంచీ మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. మాకు ఈ గుర్తింపు, అవార్డుల్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది. ‘దండోరా’ అద్భుతమైన కథ. ఇలాంటి కథను నా వద్దకు తీసుకు వచ్చిన మురళీకి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

    కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ మాట్లాడుతూ .. ‘‘దండోరా’ కథ విన్నప్పుడే నా మనసుని తాకింది. ఈ అవార్డులు, గుర్తింపు చూస్తే అందరి హృదయాల్ని ఈ చిత్రం తాకిందని నాకు అర్థమైంది. మార్క్ గారి మ్యూజిక్ విన్న తరువాత నా కంట్లోంచి నీరు వచ్చింది. శివాజీ గారి నటన గురించి చెప్పే అర్హత నాకు లేదు. మురళీ గారికి ఇది ఆరంభం మాత్రమే. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

    నటుడు నందు మాట్లాడుతూ .. ‘గద్దర్ అవార్డులు సాధించిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. మా ‘దండోరా’కి మూడు అవార్డులు వచ్చాయి. సినిమాకి అందరూ కలిసి సమిష్టిగా పని చేస్తేనే ఫలితం వస్తుంది. ఉత్తమ చిత్రం అనే దాంట్లో దర్శకుడు, నిర్మాత కూడా వస్తారు. ఉత్తమ నిర్మాత అనే కేటగిరీని కూడా మున్ముందు పెట్టాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

    నటి మనికా రెడ్డి మాట్లాడుతూ .. ‘‘దండోరా’ లాంటి చిత్రంలో నాకు మంచి పాత్ర రావడం ఆనందంగా ఉంది. మా సినిమాని గుర్తింపు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వానికి థాంక్స్’ అని అన్నారు.