- February 28, 2026
ల** అని తిడుతున్నారు.. నైట్ రేట్ ఎంత అని అడుగుతున్నారు.. రేణూ దేశాయ్ వార్నింగ్

రేణూ దేశాయ్ తాజాగా ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్ స్టాలో తనకు వస్తున్న ట్రోలింగ్, నెటిజన్లు చేస్తున్న కామెంట్లు, పెట్టే బూతులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. కుక్కల కోసం తాను పోరాడుతూ ఉంటే.. ఎందుకు అనవసరంగా తిడుతున్నారు అని రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద కుక్కలు ఉంటే.. అందులో పది పిచ్చి కుక్కలు ఉంటాయి.. వాటిని చంపితే సమస్య లేదు.. కానీ మిగిలిన 90 మంచి కుక్కల్ని కూడా చంపడం ఎందుకు? అని మాత్రమే తాను అడిగాను అని.. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా తనను ఇష్టమొచ్చినట్టుగా తిడుతున్నారు అంటూ తన బాధను వెల్లగక్కింది.
ఇక ఇన్ స్టాగ్రాంలో తనపై పచ్చి బూతులతో దాడి చేస్తున్నారని వాపోయింది. ల.. అని తిడుతున్నారు.. అది సంస్కారమేనా? పిచ్చి కుక్కలు నా ప్రైవేట్ పార్ట్‌ని కరవాలి అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.. ఆ కామెంట్ చదివి చలించిపోయాను.. ఇలాంటి కామెంట్లు అసలు పెట్టే వారు మనుషులేనా? మీ ఇంట్లో వాళ్ల పెంపకం ఇదేనా? ఇలా ఫోన్లు పట్టుకుని, ఇన్ స్టాలోకి వచ్చి బూతులు తిట్టడం వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది? అంటూ రేణూ దేశాయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనను తిడితే ఒక్క ప్రాణమైనా బతుకుతుంది అంటే తనను ఎన్నైనా తిట్టుకోండని చెప్పుకొచ్చింది. కానీ తనను తిట్టడం వల్ల ఏ ప్రాణం కూడా బతకదని, అవి బూతుల్లానే మిగిలిపోతాయ్ అని రేణూ దేశాయ్ తెలిపింది.
కాశీకి వెళ్తే కూడా తప్పేనా?.. కాశీకి వెళ్లినందుకు కూడా నన్ను తిడుతున్నారు.. నైట్ రేట్ ఎంత అని అడుగుతున్నారు.. నేను అమ్మవారి బట్టల్లో ఉన్నాను.. పూర్తిగా కప్పుకునే ఉన్నాను.. అయినా కూడా నన్ను అంత దారుణంగా తిడుతున్నారు.. ఎక్కడో ఓ పాప చనిపోతే కూడా నన్నే తిడుతున్నారు.. దానికి నాకు ఏం సంబంధం ఉంది? ఇలానే మీరు ఎన్నుకున్న నాయకుల్ని, మీ ఎమ్మెల్యేలను, ప్రభుత్వ అధికారుల్ని అడగగలరా? మీకు ఆ దమ్ముందా? నన్ను తిట్టినట్టుగా మీ ఎమ్మెల్యేలను తిట్టగలరా? అని రేణూ దేశాయ్ ఫైర్ అయింది.
ఇకపై తనను తిట్టే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రతీ ఒక్క కామెంట్‌ను సేవ్ చేస్తానని, అడ్రెస్ కనుక్కుని ఇంటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్ల ముందు నిలబెడతాను అని ట్రోలర్లకు, నెగెటివ్ కామెంట్లు చేసే వారికి రేణూ దేశాయ్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఇకపై అయినా కాస్త బుద్ది తెచ్చుకుని ప్రవర్తిస్తారా? లేదా? మునుపటిలానే బూతులతో రెచ్చిపోతారా? అన్నది చూడాలి.